
సినిమా ఇండస్ట్రీలో కథలు చేతులు మారడమనేది చాలా సహజం. ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో దగ్గరకు పోవడం ఇక్క పరిపాటిగా జరుగుతూ ఉంటుంది. సినిమా కథ నచ్చకపోవడం, తనకు సూట్ కాకపోవడం, డేట్స్ అడ్జెస్ట్ చేయకోవడం.. ఇలా వివిధ కారణాల వల్ల తమ దగ్గరకు వచ్చిన సినిమాలను రిజెక్ట్ చేస్తుంటారు హీరోలు. అలా వదిలేసిన కథలు మరో హీరో దగ్గరకు వెళ్లి బ్లాక్ బస్టర్ అయితే అయ్యో అనుకోవడం, ఫ్లాప్ అయితే హమ్మయ్య అనుకుంటుంటారు ఫ్యాన్స్. టాలీవుడ్ సూపర్ స్టార్స్ మహేష్ బాబు , ప్రభాస్ ల విషయంలో కూడా ఓ సినిమా విషయంలో ఇలాగే జరిగింది. టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరున్న ఒక ఆయన మహేష్ బాబు కు ఒక కథ చెప్పాడట. అంతకు ముందే వీరి కాంబోలో ఒక ఇండస్ట్రీ హిట్ కూడా వచ్చింది. అయితే రెండో సినిమా కోసం డైరెక్టర్ ఎంచుకున్న కథ మహేష్ కు నచ్చలేదట. కట్ చేస్తే.. అదే కథ తనకు బాగా సూటవుతుందనుకుని మరీ సినిమా చేశాడు. కట్ చేస్తే.. ఆ సినిమా అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. డార్లింగ్ కెరీర్ లో బిగ్ ఫ్లాప్ గా నిలిచిపోయింది.
అయితే ఈ సినిమా రిజెల్ట్ ఎలా ఉన్నా ప్రభాస్ తన యాక్టింగ్ తో అదరగొట్టేశాడన్న ప్రశంసలు వినిపించాయి. అతనిలోని పూర్తిస్థాయి నటుడిని ఈసినిమా బయటకు తీసిందని ప్రశంసలు వినిపించాయి. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా? కృష్ణవంశీ డైరెక్షన్ లో డార్లింగ్ నటించిన ఎమోషనల్ డ్రామా చక్రం. మురారి తర్వాత మహేష్ తో మరోసారి సినిమా చేయాలనుకున్న కృష్ణవంశీ చక్రం కథను వినిపించాడు. అయితే ఈ కథ మహేష్ బాబుకు నచ్చలేదట. ఆ పాత్ర తనకు పెద్దగా సూట్ అవ్వదని అన్నాడట. పైగా హీరో క్లైమాక్స్ లో చనిపోతాడు కాబట్టి చక్రం సినిమాను వద్దనుకున్నాడట మహేష్. కానీ అనుకోకుండా ఇదే కథను ప్రభాస్ విని బాగా ఇంప్రెస్ అయ్యాడట. ‘మనం చేద్దాం’ అని డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కట్ చస్తే.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. కానీ ప్రభాస్ పాత్రకు మాత్రం మంచి పేరు వచ్చింది.
It’s official ✅#Varanasi Makers Dismiss Rumours, Confirm April 9, 2027 Release✅#MaheshBabu #PriyankaChopra pic.twitter.com/RiZK3feqEJ
— Rahul Nandi (@RahulNandiX) January 22, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.