Pawan Kalyan: తమ్ముడు మిస్ అయ్యాడు.. అన్నయ్య బుక్కయ్యాడు.. చిరంజీవి నటించిన ఆ డిజాస్టర్ మూవీలో పవన్ హీరోనా?

సినిమా ఇండస్ట్రీలో కథలు మారడమనేది సర్వ సాధారణం. ఒక హీరో చేయాల్సిన కథ ఇంకో హీరో దగ్గరికి వెళ్లడం ఇక్కడ పరిపాటిగా జరుగుతూ ఉంటుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ భారీ డిజాస్టర్ మూవీ నుంచి పవన్ కల్యాణ్ తప్పించుకున్నాడు.

Pawan Kalyan: తమ్ముడు మిస్ అయ్యాడు.. అన్నయ్య బుక్కయ్యాడు.. చిరంజీవి నటించిన ఆ డిజాస్టర్ మూవీలో పవన్ హీరోనా?
Pawan Kalyan, Chiranjeevi

Updated on: May 22, 2025 | 5:12 PM

సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీది ప్రత్యేక స్థానం. ఈ కుటుంబం నుంచే దాదాపు అరడజకుకు పైగా హీరోలు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. గతంలోలా కాకపోయినా పవన్ కల్యాణ్ కూడా రాజకీయాల్లో ఉంటూనే కెమెరా ముందుకు వస్తున్నాడు. సినిమాల్లో చిరంజీవికి ఎంతో అనుభవం ఉంది. ఇప్పటికే 150కు పైగా సినిమాలు చేశారు. కాబట్టి సినిమాల్లో ఆయన జడ్జి మెంట్ దాదాపు రాంగ్ ఉండదు. కథను బట్టి ఆ మూవీ హిట్ అవుతుందా? లేదా? అనేది చిరంజీవికి దాదాపు ముందే తెలిసిపోతుంది. అయితే ఒక సినిమా మాత్రం మెగాస్టార్ నే బోల్తా కొట్టించింది. రిలీజ్ కు ముందు ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్లు, సాంగ్స్, ట్రైలర్ చూసి మెగాస్టార్ ఖాతాలో మరో హిట్ ఖాయమనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే సినిమా కూడా భారీగా రిలీజ్ చేశారు. కానీ తీరా థియేటర్లలో బొమ్మ పడ్డాక మొదటికే మోసం వచ్చింది. మొదటి షో నుంచే ఈ మూవీకి డిజాస్టర్ టాక్ వచ్చింది. చిరంజీవి ఈ సినిమా చేయకుండా ఉంటే బాగుండేదని మెగాభిమానులు ఇప్పటికీ ఫీలవుతూ ఉంటారు. దీని తర్వాత చిరంజీవి కొత్త సినిమా చేయడానికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు ఆ సినిమా ఎఫెక్ట్ ఎలా ఉందో. ఇలా మెగాభిమానులకు పీడకలలా మారిన సినిమా భోళా శంకర్.

మెహర్ రమేష్ తెరెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో తమన్నాహీరోయిన్ గా నటించింది. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలిగా నటించింది. వేదాళం రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ మూవీని ముందుగా ప్లాన్ చేసుకున్నది పవన్ కల్యాణ్ తో. తమిళ ఒరిజినల్ వెర్షన్ నిర్మించిన ఏఎం రత్నం దాని బ్లాక్ బస్టర్ సక్సెస్ చూసి తెలుగులో పవన్ కల్యాణ్ అయితే బాగుంటుందని భావించారు. అయితే అదే సమయంలో ఎన్నికలు అడ్డురావడంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారట . ఒకవేళ నిజంగానే రత్నం వేదాళం సినిమాను పవన్ తో తీసి ఉంటే రిజల్డ్ వేరేలా ఉండేదేమో. అలాగే చిరంజీవికి భోళా శంకర్ గండం తప్పదేమో.

ఇవి కూడా చదవండి

భోళా శంకర్ సినిమాలో చిరంజీవి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.