Tollywood: అమ్మానాన్నల పేర్లను పచ్చబొట్టుగా వేయించుకున్నటాలీవుడ్ క్రేజీ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?

హీరోలు, క్రికెటర్లు తమ ఒంటిపై రకరకాల ట్యాటూలు వేయించుకోవడం సర్వసాధారణం. అందులో తప్పేమీ లేదు. కొందరు తమ జీవిత భాగస్వామి పేర్లను పచ్చబొట్టుగా వేయించుకుంటారు. మరికొందరు తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేర్లను టాటూగా వేయించుకుంటారు. ఈ టాలీవుడ్ క్రేజీ హీరో కూడా రెండో రకానికి చెందుతాడు.

Tollywood: అమ్మానాన్నల పేర్లను పచ్చబొట్టుగా వేయించుకున్నటాలీవుడ్ క్రేజీ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actor

Updated on: Jul 25, 2025 | 11:55 AM

పై ఫొటోలో ఉన్న పిల్లాడిని గుర్తు పట్టారా? అతను ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో. తన నటనతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయ్యాడు. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత ముఫాఖం జా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యాడు. ఇదే క్రమంలో నటనపై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. కానీ అధైర్య పడకుండా ముందుకు సాగాడు. తనకు నప్పే స్టోరీలను ఎంచుకుని సక్సెస్ అయ్యాడు. కొన్నేళ్ల క్రితం వరకు ఓ మిడిల్ రేంజ్ హీరోగా ఉండిపోయాడు. ఇప్పుడు మాత్రం పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ హీరో నటించిన ఒక డివోషనల్ మూవీ ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు కూడా ఈ నటుడి ఖాతాలో రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులున్నాయి. ఇలా మిడిల్ రేంజ్ హీరోల్లో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన ఆ నటుడు మరెవరో కాదు నిఖిల్ సిద్ధార్థ్

నిఖిల్ తల్లి పేరు వీణ. తండ్రి శ్యామ్. 2022లో ఓ అరదైన వ్యాధితో బాధపడుతూ నిఖిల్ తండ్రి కన్నుమూశాడు. కాగా ఈ హీరోకు తన తల్లిదండ్రులంటే అమితమైన ప్రేమ. అందుకే వారి పేర్లను వీపుపై పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు.

భార్య, బిడ్డలతో హీరో నిఖిల్ సిద్ధార్థ..

రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజి బిజీగా..

నిఖిల్ ప్రస్తుతం రెండు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో స్వయంభు ఒకటి. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ హిస్టారికల్ మూవీలో నభా నటేష్, సంయుక్తా మేనన్ కథానాయికలుగా కనిపించనున్నారు. భువన్, శ్రీకర్‌ నిర్మాతలు కాగా ఠాగూర్‌ మధు సమర్పకులగా వ్యవహరిస్తున్నారు. నిఖిల్‌కి ఇది 20వ చిత్రం. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు ద ఇండియా హౌస్ అనే మూవీలో నటిస్తున్నాడు నిఖిల్.

తండ్రితో హీరో నిఖిల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.