Balakrishna: చిరంజీవి నో చెప్పిన కథతో బాలయ్య ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.. ఆ సినిమా ఎదో తెలుసా..?

కొన్నిసార్లు ఒక స్టార్ హీరో నో చెప్పిన కథతో మరో హీరో సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి కోసం రెడీ చేసిన కథతో బాలయ్య బాబు సినిమా చేసి  ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అప్పట్లో ఆ సినిమా ఓ సంచలనం అనే చెప్పాలి ఇంతకు ఆ సినిమా ఏది.? ఎందుకు చిరంజీవి మిస్ చేసుకున్నారు.? బాలయ్య దగ్గరకు ఆ కథ ఎలా వెళ్ళింది.?

Balakrishna: చిరంజీవి నో చెప్పిన కథతో బాలయ్య ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.. ఆ సినిమా ఎదో తెలుసా..?
Chiranjeevi, Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: May 14, 2024 | 9:25 AM

సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా కథ చాలా మంది హీరోల దగ్గరకు వెళ్లి చివరకు ఒక హీరోతో ఫైనల్ అవుతుంది. ఇలా ఒకరికోసం రాసుకున్న కథతో మరొ హీరోతో సినిమాలు చేసినవి చాలానే ఉన్నాయి. కొన్నిసార్లు ఒక స్టార్ హీరో నో చెప్పిన కథతో మరో హీరో సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి కోసం రెడీ చేసిన కథతో బాలయ్య బాబు సినిమా చేసి  ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అప్పట్లో ఆ సినిమా ఓ సంచలనం అనే చెప్పాలి ఇంతకు ఆ సినిమా ఏది.? ఎందుకు చిరంజీవి మిస్ చేసుకున్నారు.? బాలయ్య దగ్గరకు ఆ కథ ఎలా వెళ్ళింది.? ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం..!

కోడి రామకృష్ణ ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులను అలరించారు. అప్పట్లో కోడి రామకృష్ణ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ వేరే.. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో మంగమ్మగారి మానవుడు సినిమా ఒకటి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఓ కల్ట్ క్లాసిక్ అనే చెప్పాలి.

అయితే ఈ సినిమాను కోడిరామకృష్ణ ముందుగా మెగాస్టార్ చిరంజీవికి చెప్పారట. అయితే ఆ కథ నచ్చకపోవడంతో చిరంజీవి నో చెప్పారట. దాంతో కోడిరామకృష్ణ ఇదే కథను బాలకృష్ణ కు చెప్పారట.. ఆయనకు కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారట. దాంతో ఈ సినిమాను రూపొందించారట. మంగమ్మగారు మానవుడు సినిమా సంచలన విజయం సాధించింది. అలాగే ఈ సినిమా హీరోయిన్ గా బాలయ్య సరసన సుహాసినిని ఎంపిక చేశారు. భార్గవ్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. బాలకృష్ణకు తిరుగులేని ఇమేజ్ తెచ్చిపెట్టింది.

చిరంజీవి ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.