Keerthy Suresh: బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ అందుకున్న కీర్తిసురేష్.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్
సీనియర్ బ్యూటీస్ కూడా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారు. మొన్నీమధ్య నయనతార అక్కడ జవాన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. అలాగే త్వరలోనే త్రిష కూడా హిందీలో సినిమా చేయనుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరో యంగ్ బ్యూటీ కూడా ఇప్పుడు బాలీవుడ్ లో సత్తా చాటాలని చూస్తుంది. తెలుగునాట మహానటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తిసురేష్.
ఇప్పుడు హీరోయిన్స్ అందరూ అన్ని భాషల్లో నటించాలని ఆశపడుతున్నారు. ఇతరభాషల్లోనూ తమ సత్తా చాటాలని చూస్తున్నారు. ఇప్పటికే యంగ్ హీరోయిన్స్ రష్మిక మందన్న, పూజాహెగ్డే లాంటి హీరోయిన్స్ తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు హిందీలోనూ నటిస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సీనియర్ బ్యూటీస్ కూడా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారు. మొన్నీమధ్య నయనతార అక్కడ జవాన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. అలాగే త్వరలోనే త్రిష కూడా హిందీలో సినిమా చేయనుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరో యంగ్ బ్యూటీ కూడా ఇప్పుడు బాలీవుడ్ లో సత్తా చాటాలని చూస్తుంది. తెలుగునాట మహానటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తిసురేష్. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తిసురేష్ తమిళ్ లోనూ స్టార్ హీరోల సరసన నటించింది.
మొన్నటివరకు పద్ధతైన పాత్రలతో ఆకట్టుకున్న కీర్తిసురేష్ ఇప్పుడు గ్లామర్ లుక్ లో కనిపించి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ చిన్నది తెలుగు, తమిళ్ తో పటు బాలీవుడ్ లోనూ నటిస్తుంది. బాలీవుడ్ లో కీర్తిసురేష్ ప్రస్తుతం వరుణ్ ధావన్ తో కలిసి బేబీ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నదానికి బాలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.
బాలీవుడ్ లో కీర్తిసురేష్ అక్షయ్ కుమార్ సరసన నటించే ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది. అక్షయ్ కుమార్ నెక్స్ట్ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుందని టాక్ నడుస్తుంది. ఈ వార్తల పై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వార్త నిజమైతే కీర్తిసురేష్ క్రేజ్ బాలీవుడ్ లో పెరగడం ఖాయం. ప్రియదర్శన్ అక్షయ్ కుమార్ తో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అలియా భట్, కియారా అద్వానీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీటితో పాటు కీర్తిసురేష్ పేరు కూడా వినిపిస్తుంది. అక్షయ్ సినిమాలో ఛాన్స్ అందుకుంటే కీర్తిసురేష్ క్రేజ్ డబుల్ అవ్వడం ఖాయం.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.