ఇదెక్కడి ట్విస్ట్ మావ.. ఈ నటుడి భార్య తెలుగులో తోప్ హీరోయిన్.. బాలయ్యతో సూపర్ హిట్ అందుకుంది

సీనియర్ హీరోలు, నటులు చాలా మంది ఇప్పుడు సహాయక పాత్రలో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఒకప్పుడు హీరోలుగా సినిమాలు చేసి ఇప్పుడు విలన్స్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా నటిస్తున్న వారిలో రాంకీ ఒకరు. ఈ నటుడు తెలుగులో సిందూర పువ్వు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇదెక్కడి ట్విస్ట్ మావ.. ఈ నటుడి భార్య తెలుగులో తోప్ హీరోయిన్.. బాలయ్యతో సూపర్ హిట్ అందుకుంది
Ramki

Updated on: Jul 13, 2026 | 1:03 PM

చాలా మంది సీనియర్ హీరోలు హీరోయిన్స్ ఇప్పుడు విలన్స్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా, సహాయక పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ లిస్ట్ లో చాలా మంది నటీనటులు ఉన్నారు. ముఖ్యంగా హీరోలు ఇప్పుడు విలన్స్ గా అదరగొడుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ దూసుకుపోతున్నారు చాలా మంది హీరోలు.. అలాంటి వారిలో రాంకీ ఒకరు. ఈ నటుడి పూర్తి పేరు రామకృష్ణ. కాగా రాంకీగా పాపులర్ అయ్యారు. ఈ నటుడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు ఆయన. తెలుగు, తమిళ్ భాషల్లో నటించి ఎంతో మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు. తమిళ్ లో ఎక్కువ సినిమాలు చేసిన రాంకీ..

ఇది కూడా చదవండి : ఆమెకు19 ఆయనకు 31..! 20ఏళ్ల పెద్ద హీరోని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన కుర్ర హీరోయిన్

తెలుగులో సంఘటన, భలే ఖైదీలు, దోషి, ఒసేయ్ రాములమ్మ, రౌడీ దర్బార్, ఆకతాయి వంటి సినిమాలు చేశారు. అలాగే తమిళ్ లో ఆయన నటించిన సెంథూర పూవే సినిమా తెలుగులో సిందూర పువ్వు అనే టైటిల్ తో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఒకప్పుడు హీరోగా రాణించిన రాంకీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. 2018లో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరో గాడ్ ఫాదర్ గా కనిపించి మెప్పించాడు రాంకీ.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : చిన్నప్పుడు అతన్ని ఎత్తుకొని అన్నం తినిపించా.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు

ఆర్ఎక్స్ 100 సినిమాలో ఆయన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజా సినిమాలో  హీరో ఫ్రెండ్ గా కనిపించాడు. అలాగే కస్టడీ సినిమాతో పాటు లక్కీ భాస్కర్ లాంటి సినిమాలో నటించాడు. అయితే ఈ స్టార్ నటుడి భార్య గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. రాంకీ భార్య కూడా హీరోయిన్ గా సినిమాలు చేసింది. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ ఆమె.. ఆ హీరోయిన్ మరెవరో కాదు అందాల భామ నిరోష. శ్రీలంకలో జన్మించిన నిరోష పలు తమిళ, తెలుగు చిత్రాల్లో నటించింది. తెలుగులో బాలకృష్ణ నటించిన నారీ నారీ నడుమ మురారి, మహాజనానికి మరదలు పిల్ల, స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ ఇలా పలు సినిమాలు చేసింది. కాగా రాంకీ నిరోషాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా కాలం వీరు రహస్యంగా కలిసి ఉన్నారు. ఆతర్వాత ఈ ఇద్దరూ పెళ్లిచేసుకున్నారు. పెళ్లి తర్వాత నిరోష సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. రాంకీ కూడా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి ఆతర్వాత ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. కాగా నిరోషా.. సీనియర్ హీరోయిన్ రాధికకు చెల్లి అవుతుంది. ప్రస్తుతం ఆమె తమిళ్ సీరియల్స్ లో నటిస్తున్నారు.

ఇది కూడా చదవండి : చిన్నప్పుడు అతన్ని ఎత్తుకొని అన్నం తినిపించా.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు

నిరోషా ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us