AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Johnny Master VS Sekhar Master: జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య గొడవ.. అసలు ఎక్కడ చెడిందంటే

డ్యాన్స్ మాస్టర్స్ జానీ vs శేఖర్ : ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. అసోసియేషన్ ఎన్నికలపై ఇరు వర్గాల మధ్య విభేదాలు చెలరేగాయి. అసోయేషన్‌ ప్రెసిడెంట్‌ సుమలత తీరుపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమలత తీరును నిరసిస్తూ 10 మంది డ్యాన్సర్లు రాజీనామా చేశారు. సభ్యుల సంక్షేమం, అంతర్గత నిర్ణయాలపై పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. వాగ్వాదంతో అసోసియేషన్ సమావేశం వేడెక్కింది. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణంతో పోలీసుల జోక్యం చేసుకున్నారు.

Johnny Master VS Sekhar Master: జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య గొడవ.. అసలు ఎక్కడ చెడిందంటే
Johnny Master, Sekhar Master
Rajeev Rayala
|

Updated on: Jul 13, 2026 | 12:32 PM

Share

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్‌లో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం. తెలుగు ఫిల్మ్‌ డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో వివాదంలో జానీ మాస్టర్ భార్య పేరు తెరపైకొచ్చింది. అసోసియేషన్‌ అధ్యక్షురాలు, కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ భార్య సుమలతపై కొందరు డ్యాన్సర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విషయంలో ఆమె ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సుమలత తీరు నచ్చక అసోసియేషన్‌కు చెందిన 10 మంది డ్యాన్సర్లు రాజీనామా చేశారు. ఫెడరేషన్‌ అనుమతి లేకుండా బై ఎలక్షన్‌కు సుమలత సిద్ధం కావడంతో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. యూనియన్ పెద్దలు జోక్యం చేసుకుని వివాదాన్ని సర్దుమణిగేలా చేయాలని సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : ఆమెకు19 ఆయనకు 31..! 20ఏళ్ల పెద్ద హీరోని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన కుర్ర హీరోయిన్

అయితే ఈ వైరల్ వీడియోపై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఏదీ రాలేదు. అసోషియేస్ కానీ లేదా జానీ మాస్టర్ కానీ, శేఖర్ మాస్టర్ కానీ ఇంకా దీనిపై రియాక్ట్ కాలేదు. ఏదేమైనా ఇద్దరు టాప్ కొరియోగ్రాఫర్లు ఇలా కోపం ప్రదర్శించడం మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చనీయాశంగా మారింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : చిన్నప్పుడు అతన్ని ఎత్తుకొని అన్నం తినిపించా.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు

ఇప్పుడు టాలీవుడ్ లో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ టాప్ కొరియోగ్రాఫర్లుగా సినిమాలకు పని చేస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్.. ఇలా టాప్ స్టార్ల సినిమాలకు కొరియోగ్రాఫీ చేస్తున్నారు. అలాంటి టాప్ కొరియోగ్రాఫర్ల మధ్య ఈ వాగ్వాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us