పొట్టి పిల్ల గట్టి పిల్లే.. క్యూట్ లుక్స్ తో ప్రస్తుత యూత్ క్రాష్‌గా మారిన మిథిలా పాల్కర్‌

12-07-2026

Pic credit - Instagram

Phani Ch

మిథిలా పాల్కర్‌ టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. ఇదివరకు యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌ సరసన 'ఓరి దేవుడా' సినిమాలో నటించి తన క్యూట్ యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకుంది.

చిన్నప్పటి నుంచే మిథిలాకు నటన అన్నా, సినిమాలన్నా విపరీతమైన ఇష్టం ఉండేదట. అలా యాక్టింగ్ వైపు అడుగులు వేస్తూ మొదట 'మఝా హనీమూన్‌' అనే మరాఠీ షార్ట్‌ఫిలింతో కెరీర్ ప్రారంభించింది.

బాలీవుడ్‌లో 2014లో విడుదలైన 'కట్టీ బట్టీ' చిత్రంతో ఈమె తొలిసారి వెండితెరపై మెరిసింది.  అయితే ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో మిథిలాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.

ఈ గ్యాప్‌లో యూట్యూబ్‌లో వచ్చిన 'న్యూస్‌ దర్శన్‌' అనే సెటైరికల్‌ షోలో ఆమెకు మంచి అవకాశం వచ్చింది. దీంతో యూట్యూబ్‌, ఓటీటీ వేదికలపై ఆమెకు చక్కటి అవకాశాలు వచ్చాయి.

‘గర్ల్‌ ఇన్‌ ది సిటీ’, ‘లిటిల్‌ థింగ్స్‌’ అనే వెబ్‌ సిరీస్‌ల్లో తన అందం, హావభావాలతో యువతరం ప్రేక్షకుల గుండెల్లో జెండా పాతేసింది.

ఈ ఏడాది బాలీవుడ్‌లో ‘హ్యాపీ పటేల్‌: ఖతర్నాక్‌ జాసూస్‌’తో పాటు ప్రముఖ కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌తో కలిసి ‘భూత్‌ బంగ్లా’లో నటించి మెప్పించింది.

తాజాగా  'సూపర్‌ సుబ్బు' వెబ్ సిరీస్ ద్వారా మిథిలాకు తెలుగులో మంచి గుర్తింపు దక్కింది. ఇందులో పల్లెటూరి వాతావరణంలో తెలంగాణ మాండలికం మాట్లాడుతూ అదరగొట్టేసింది.