Chandramukhi: చంద్రముఖి సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా? రజనీ కాంత్ అలా వచ్చాడా?

సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో చంద్రముఖి సినిమాకు ప్రత్యేక స్థానముంది. 2005లో విడుదలైన ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. అయితే ఈ సినిమాను ఒక టాలీవుడ్ స్టార్ హీరో వద్దనుకున్నారట.

Chandramukhi: చంద్రముఖి సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా? రజనీ కాంత్ అలా వచ్చాడా?
Chandramukhi Movie

Updated on: May 29, 2025 | 3:51 PM

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో చంద్ర ముఖి ఒకటి. పి. వాసు తెరకెక్కించిన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీలో నయన తార, జ్యోతిక, ప్రభు, వడివేలు, వినీత్, నాసర్, మనోబాల తదితర ప్రముఖులు నటించారు. 2005లో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా పెద్ద సంచలనమే సృష్టించింది. బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భార వసూళ్లు రాబట్టింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లోనే రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. సినిమాలో కామెడీ, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు.. ఇలా అన్నీ అంశాలు ఉండడంతో చంద్రముఖి సినిమా ఆడియెన్స్ కు బాగా నవ్వించడంతో పాటు బాగా భయ పెట్టింది. ఇప్పటికీ టీవీల్లో ఈ సినిమా వస్తే చాలా మంది ఛానెల్ మార్చుకుండా చూస్తారు. ఇక తన కెరీర్ లో చంద్రముఖి సినిమాకు ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుందని రజనీ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

అయితే చంద్రముఖి సినిమాలో హీరోగా రజనీకాంత్ ఫస్ట్ ఛాయిస్ కాదట. డైరెక్టర్ పి.వాసు ఈ సినిమా కథ పట్టుకుని ఒక టాలీవుడ్ స్టార్ హీరో దగ్గరకు వెళ్లారట. కథ బాగానే విన్న ఆ స్టార్ హీరో ఇది తన ఇమేజ్ కు సూట్ కాదన్నారట. దీంతో డైరెక్టర్ వాసు నేరుగా రజనీకాంత్ వద్దకు వెళ్లి కథ చెప్పారట. ఈ రీమేక్ రైట్స్ ని తమిళ హీరో ప్రభు సొంతం చేసుకుని ఉండంతో రజనీకాంత్ ని హీరోగా పెట్టి చంద్రముఖి సినిమాను తెరకెక్కించాడు. ఆ తర్వాత ఈ సినిమా విడుదలై ఎలాంటి సంచలనం సృష్టించింది. తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లు రాబట్టింది. ఇలా బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. డైరెక్టర్ వాసు మొదట చిరంజీవికే ఈ చంద్రముఖి కథ చెప్పాడట. అయితే ఆయన ఎందుకో దీనిపై పెద్దగా ఆసక్తి చూపించలేదట.

ఇవి కూడా చదవండి

రాఘవేంద్ర రావుతో చిరంజీవి..

ఇవి కూడా చదవండి..

OTT Movie: పౌర్ణమి రోజున రెచ్చిపోయే రక్త పిశాచి.. ఓటీటీలో ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్.. చిన్న పిల్లలు చూడొద్దు

Tollywood: 17 ఏళ్లకే సినిమాల్లోకి.. బిగ్ బాస్‌తో ఎనలేని క్రేజ్.. ఈ విజయవాడ బ్యూటీని గుర్తు పట్టారా?

Tollywood: ఏంటమ్మా ఇది! వోడ్కాకు బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నెటిజన్ల ఆగ్రహం

Hari Hara Veera Mallu: పవన్ హరి హర వీరమల్లులో మెరిసిన టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్.. ఎవరో గుర్తు పట్టారా?

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.