Tollywood: చంద్రముఖి సినిమాలోని ఈ సిద్ధాంతి గుర్తున్నాడా? ఆయన భార్య కూడా టాలీవుడ్‌లో ప్రముఖ నటి
ఎక్కువగా మాస్, యాక్షన్ సినిమాలు చేసే సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఇమేజ్‌కు భిన్నంగా నటించిన చిత్రం చంద్రముఖి. 19 ఏళ్ల కిందట రిలీజైన ఈ సినిమా అప్పట్లో ఆడియెన్స్‌ను బాగా భయపెట్టడంతో పాటు కడుపుబ్బా నవ్వించింది.
రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో చంద్రముఖి ఒకటి. 2005లో రిలీజైన ఈ సినిమాలో జ్యోతిక, నయనతార, ప్రభు, వినీత్, మాళవిక, వడివేలు, నాజర్, మాళవిక, మనోబాల, సోనూసూద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. పి. వాసు తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ సినిమా అప్పట్లోనే సుమారు 60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికీ కూడా ఈ సినిమా టీవీల్లో వస్తుందంటే చాలామంది టీవీలకే అతుక్కుపోయి మరీ చూస్తుంటారు. చంద్రముఖి సినిమాలో ప్రతీ పాత్రకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అందులో రజనీకాంత్ కు సహాయపడే రామచంద్ర సిద్ధాంతి పాత్ర కూడా ఒకటి. ఫస్ట్ హాఫ్ లో పెద్దగా కనిపించకపోయినా సెకండ్ హాఫ్‌లో సిద్ధాంతి పాత్ర బాగా హైలెట్ గా నిలిచింది. అలా సిద్ధాంతి పాత్రలో జీవించేసిన నటుడి పేరు అవినాష్. మైసూర్ కు చెందిన ఆయన ఎక్కువగా కన్నడ, తమిళ సినిమాల్లోనే నటించాడు. స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక చంద్రముఖితో పాటు గోల్ మాల్, లక్ష్మీ కల్యాణం, నాగవల్లి, ఒక్కడు, దరువు, ఢమరుకం, రోగ్, రాజు గారి గది 2, లేటెస్ట్ గా అనన్య నాగళ్ల తంతిరం సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు.
అన్నట్లు అవినాష్ సతీమణి కూడా స్టార్ నటినే. కన్నడ, తమిళ సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఆమె డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. ఆమె మరోవరో కాదు కేజీఎఫ్ సినిమాలో డైనమిక్ రోల్ చేసిన మాళవిక. ఈ సినిమాలో రిపోర్టర్ గా, 24/న్యూస్ చీఫ్ ఎడిటర్‌గా మాళవిక అవినాష్ కీలక పాత్రలో నటించింది. తెలుగులో ఆమె సినిమాలు చేయలేదు కానీ తమిళం, కన్నడలో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అన్నట్లు మాళవిక రాజకీయాల్లోనూ చురుగ్గా వ్యవహరిస్తోంది. కర్ణాటకలో బీజేపీ అధికార ప్రతినిధిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోందీ సీనియర్ నటి.
భార్య మాళవికతో నటుడు అవినాష్..
View this post on Instagram
కేవలం సినిమాలే కాదు పలు సీరియల్స్‌లో కూడా మాళవిక నటించింది. తెలుగులో బాగా ఫేమస్ అయిన బతుకు జట్కా బండి టీవీ ప్రోగ్రామ్ కు కన్నడలో మాళవిక అవినాష్ నే హోస్ట్ గా వ్యవహరించింది.
మాళవిక, అవినాష్ ల ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.