
2005లో సూపర్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది మంగళూరు బ్యూటీ అనుష్కా శెట్టి. విక్రమార్కుడు, లక్ష్యం, డాన్, శౌర్యం, చింతకాలయ రవి, కింగ్, బిల్లా, సింగం, రగడ, మిర్చి, డమరుకం, బాహుబలి, బాహుబలి 2 , మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి వంటి హిట్ సినిమాల్లో నటించింది. అలాగే అరుంధతి, రుద్రమ దేవి, భాగమతి, సైజ్ జీరో, నిశ్శబ్ధం తదితర లేడీ ఓరియంటెడ్ మూవీస్ తోనూ హిట్స్ కొట్టింది. కాగా బాహుబలి 2 తర్వాత సినిమాలు బాగా తగ్గించేసిందీ అందాల తార. కేవలం కథా ప్రాధాన్యమున్న సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తోంది. ఆ మధ్యన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి వంటి ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ లో నటించిన అనుష్క త్వరలో మరో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ తో మన ముందుకు రానుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క నటించిన ఘాటి త్వరలోనే థియేటర్లలోకి రానుంది. అనుష్క ఎన్ని సినిమాలైనా చేసి ఉండచ్చుగాక.. ఆమె కెరీర్ లో బాగా గుర్తుండిపోయే సినిమాల్లో వేదం ఒకటి. ఇందులో ఆమె వేశ్య పాత్ర వేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
క్రిష్ జాగర్ల మూడి తెరకెక్కించిన వేదం సినిమా రిలీజ్ (జూన్04) 15 ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కూడా ఒక స్పెషల్ పోస్ట్ పెట్టాడు. వేదం సినిమా సమయంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. వేదం సినిమా నుంచి అనుష్క పసుపు చీర కట్టుకొని వెనక్కి తిరిగి చూస్తున్న స్టిల్స్ ని ప్రమోషన్స్ లో బాగా వాడారు. హైదరాబాద్ లోని చాలా చోట్ల అనుష్క ఫొటోని హోర్డింగ్ గా పెట్టారట. పంజాగుట్ట సర్కిల్ లో కూడా అనుష్క వెనక్కి తిరిగి చూస్తున్న ఫొటోని పెద్ద హోర్డింగ్ గా పెట్టారట. దీంతో ఆ హోర్డింగ్ లో అనుష్కని చూస్తూ వాహనదారులు యాక్సిడెంట్ల బారిన పడ్డారట. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అలా ఏకంగా దాదాపు 40 యాక్సిడెంట్ లు జరిగాయట. మరీ పెద్ద యాక్సిడెంట్స్ కాకపోయినా అనుష్క హోర్డింగ్ చూస్తూ ముందు ఉన్న వాహనాలను ఢీకొట్టేవారట. ఇలా రెగ్యులర్ గా యాక్సిడెంట్స్ జరుగుతుండడాన్ని గమనించిన పోలీసులు GHMC అధికారులతో కలిసి అనుష్క హోర్డింగ్ ని తొలగించారట. అలా అనుష్క తన అందంతో ఎవర్ని చూపు తిప్పుకోనివ్వకుండా చేసిందన్నమాట.
Anushka Shetty Poster
15 years of Vedam 🙏🏽
A film that was out of the box for me.
Gratitude to @DirKrish garu for crafting something so honest.
To my amazing co-stars @MsAnushkaShetty, @HeroManoj1 & @BajpayeeManoj sir , and many others . Sharing this journey with you all was truly special .… pic.twitter.com/fQ4VSGCcAd— Allu Arjun (@alluarjun) June 4, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.