
కొన్ని కథలు వినడానికి చాలా బాగుంటాయి.. కానీ సినిమాగా తీస్తే మాత్రం సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా ఆకట్టుకోవు. అదే సమయంలో ఇంకొన్ని కథలు వినడానికి అంతగా బాగోవు. కానీ సరైన డైరెక్షన్ లో సినిమా తీస్తే మాత్రం సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతాయి. అయితే కొంత మంది హీరోలు మాత్రం దీనిని సరిగ్గా అంచనా వేయలేరు. తమ అనాలసిస్, విజువలైషన్ ఆధారంగా సినిమా ఫలితాన్ని బేరీజు వేసుకుని ముందుకు సాగుతారు. ప్రస్తుతం మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా అలాంటిదే. ఈ కథను ఏకంగా 12 మంది స్టార్ హీరోలు తిరస్కరించారట. టాలీవుడ సూపర్ స్టార్ మహేష్ బాబు, అజిత్, మాధవన్, కమల్ హాసన్, విక్రమ్, విశాల్.. ఇలా సౌత్ ఇండస్ట్రీలో ఉన్న 12 మంది టాప్ స్టార్స్ ఈ సినిమా కథను వద్దన్నారట. కొంత మంది హీరో క్యారెక్టరైజేషన్ నచ్చక రిజెక్ట్ చేస్తే.. మరికొందరు కథ నచ్చక తిరస్కరించారు. అయితే చివరకు ఒక హీరో మాత్రం నేను చేస్తాను అంటూ ముందుకు వచ్చాడు. అదే కథతోనే సినిమా తీశాడు. ఫలితం.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసేసింది. దెబ్బకు అప్పటివరకు మీడియం రేంజ్ లో ఉన్న ఆ హీరో కాస్తా స్టార్ హీరో అయిపోయాడు. డైరెక్టర్ కు కూడా మంచి పేరొచ్చింది. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా? కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన గజిని.
ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన గజిని సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతోనే టాలీవుడ్ లో సూర్య మార్కెట్ బాగా పెరిగింది. ఇక ఇదే మూవీని హిందీలో రీమేక్ చేయగా అక్కడ కూడా వందల కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇందులో అమీర్ ఖాన్ హీరోగా నటించాడు. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కించాలనే యోచనలో ఉన్నారు.
Ghajini Movie