Dulquer Salman: దుల్కర్ సల్మాన్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా ?.. అంతకు ముందు ఎలా ఉన్నాడంటే..

సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో దుల్కర్ సల్మాన్ ఒకరు. మలయాళీ స్టార్ మమ్ముట్టి తనయుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన దుల్కర్ సల్మాన్.. మలయాళంతోపాటు తెలుగులోనూ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని హీరోగా తనకంటూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. తాజాగా ఈ హీరో చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Dulquer Salman: దుల్కర్ సల్మాన్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా ?.. అంతకు ముందు ఎలా ఉన్నాడంటే..
Dulquer Salman Pics

Updated on: Apr 03, 2025 | 9:08 AM

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మమ్ముట్టి నట వారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ హీరో సహజమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇన్నాళ్లు మలయాళంలో వరుస హిట్స్ అందుకున్న దుల్కర్.. ఇప్పుడు తెలుగులోనూ సత్తా చాటుతున్నాడు. మహానటి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరో… ఇటీవలే లక్కీ భాస్కర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం తెలుగుతోపాటు మలయాళంలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. నిజానికి ఈ హీరోకు యూత్ లో ఎక్కువగా ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే. దుల్కర్ సల్మాన్ స్టైల్, హెయిర్ స్టైల్, స్మైల్ అంటే పడిచచ్చే అభిమానులు ఉన్నారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అందులో దుల్కర్ సల్మాన్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. అందంగా కనిపించేందుకు దుల్కర్ సల్మాన్ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖానికి దుల్కర్ సల్మాన్ సర్జరీ చేయించుకున్నాడని ప్రముఖ డాక్టర్ మిథున్ వెల్లడించారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే ఇండస్ట్రీలోని చాలా మంది స్టార్స్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు.

Dulquer Salman

దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్నారు. లక్కీ భాస్కర్ హిట్ తర్వాత ఈ హీరోకు మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి. అద్భుతమైన నటనతో విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు ఈ హీరో. ఇప్పుడు తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తున్నారు.

Dulquer Salman News

ఇవి కూడా చదవండి : 

Tollywood: మరీ ఇంత క్యూట్‏గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‏కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..

Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..

Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..