విడిపోవాలంటే రూ. 60కోట్లు ఇవ్వాల్సిందే.. ఈ హీరోయిన్ మామూల్ది కాదు భయ్యా..!
నిన్నమొన్నటివరకు కనిపించిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు కనబడుటలేదు. సినిమాలకు దూరంగా ఫ్యామిలీతో గడిపేస్తున్నారు. వరుస సినిమాతో హీరోయిన్స్ గా అలరించిన చాలా మంది భామలు ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. అలంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. ఆమె ఓ స్టార్ క్రికెటర్ ను పెళ్లి చేసుకుంది.

సినిమా ఇండస్ట్రీలో విడాకుల హవా నడుస్తుంది . ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు విడాకులు తీసుకొని అందరికి షాక్ ఇస్తున్నారు. నిజానికి సినిమా ఇండస్ట్రీలో లవ్ స్టోరీలు, బ్రేకప్, ఎఫైర్స్ , డేటింగ్స్, పెళ్లి, విడాకులు చాలా కామన్ అవుతున్నాయి. స్టార్ సెలబ్రెటీలు కూడా విడాకులు అనౌన్స్ చేసి షాక్ ఇస్తున్నారు. సమంత నాగ చైతన్య దగ్గర నుంచి రీసెంట్ గా జయం రవి వరకు చాలా మంది స్టార్ సెలబ్రెటీలు విడాకులు తీసుకున్నారు. తాజాగా ఓ క్రేజీ హీరోయిన్ కూడా భర్తనుంచి విడిపోయింది. పై ఆమె భర్త మామూలోడు కాదు స్టార్ క్రికెటర్. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరు.? ఆ క్రికెటర్ ఎవరు.? అసలు ఎందుకు విడిపోయారు.?
సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ క్రికెటర్స్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారిలో శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్య, మహమ్మద్ షమీ ఇలా స్టార్ క్రికెటర్స్ తమ భార్యలకు విడాకులు ఇచ్చారు. రీసెంట్ గా బౌలింగ్ దిగ్గజం యుజ్వీంద్ర చాహల్కూడా జాయిన్ అయ్యాడు. ఇటీవలే యుజ్వీంద్ర చాహల్ తన భార్య నుంచి విడిపోతున్నట్టు వార్తలు వచ్చాయి. చాహల్ 2022లో ధనశ్రీ వెర్మ ను వివాహం చేసుకున్నాడు. కొంతకాలం ఈ జంట బాగానే ఉన్నారు. కానీ ఏమైందో ఏమో కానీ విడిపోతున్నట్టు ఫ్యాన్స్ కు హింట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఒకరి ఫోటోలు మరొకరు డిలీట్ చేసుకున్నారు. అలాగే ఇద్దరూ ఎక్కడా కలిసి కనిపించడం లేదు.
ఇప్పుడు వీరి గురించి ఓ షాకింగ్ విషయం నెట్టింట చక్కర్లు కొడతుంది. ధనశ్రీ వెర్మ భరణంగా చాహల్ నుంచి ఏకంగా రూ. 60 కోట్లు డిమాండ్ చేసిందని సోషల్ టాక్ వినిపిస్తుంది. ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియదు కానీ ఈ న్యూస్ పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ధనశ్రీ వెర్మ ఇప్పుడు మరొకరితో డేటింగ్ చేస్తుంది అనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి నిజంగా ధనశ్రీ వెర్మ చాహల్ నుంచి భరణం డిమాండ్ చేసిందా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




