టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కంటిన్యూ అవుతున్నారు దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad). స్టార్ హీరోలందరికీ ఫస్ట్ ఛాయిస్ దేవీ. అయితే ఈ మధ్య కాలంలో దేవి జోరు తగ్గిందని టాక్ వినిపిస్తోంది. తమన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. సూపర్ హిట్స్ అందుకుంటున్నారు. కానీ దేవి శ్రీ మాత్రం స్పీడ్ తగ్గించారు. తమన్ 10, 11 సినిమాలు లైనప్ చేస్తుంటే దేవీ మాత్రం రెండు మూడు సినిమాల దగ్గర ఆగిపోతున్నారని నిరాశ వ్యక్తం చేస్తున్నారు దేవీ ఫ్యాన్స్. అయితే ఇటీవల దేవి సంగీతం అందించిన పుష్ప సినిమా మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినా ఈ సినిమా అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. దాంతో పుష్ప సాంగ్స్ కు మంచి క్రేజ్ వచ్చింది. దాంతో దేవీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ స్టార్ హీరో దేవీ శ్రీ ప్రసాద్ ను రిజక్ట్ చేశారని టాక్ వినిపిస్తోంది.
ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. గతంలో సల్మాన్ నటించిన రెడీ సినిమాలో డింకచికా..డింకచికా అని రింగ రింగ సాంగ్ ను వాడుకున్నారు. అలాగే రాధే సినిమాలో సీటీమార్ సాంగ్ ను వాడుకున్నాడు. ఇప్పుడు సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కి రెండు సాంగ్స్ చేయాలని అడిగారట. దాంతో దేవీ శ్రీ చాలా ట్యూన్స్ వినిపించారట.. అయితే అవి ఏవీ సల్మాన్ ఖాన్ కు తృప్తి ఇవ్వలేక పోయాయట. దాంతో సల్మాన్ దేవీని పక్కన పెట్టమని చెప్పాడట.. మేకర్స్ కూడా ఇదే మాటను దేవీ శ్రీ కి చెప్పేశారట. ఇందుకు సంబంధించిన వార్త బీ టౌన్ లో చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి