యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న మాచర్ల నియోజకవర్గం సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. నూతన దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ క్యురియాసిటీని పెంచుతోంది. ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మాచర్ల నియోజకవర్గం ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్స్ దూకుడు పెంచిన చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమా నుంచి మాచర్ల యాక్షన్ ధమ్కీని రిలీజ్ చేసింది.
పర్ఫెక్ట్ మాస్ ఎంటర్‌టైనర్‌కి సంబంధించిన అన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ చూపించే ట్రెమండస్ యాక్షన్ సీక్వెన్స్ ఈ చిన్న కట్లో అద్భుతంగా చూపించారు. మాచర్ల యాక్షన్ ధమ్కీ లో అదిరిపోయే డైలాగ్, అద్భుతమైన యాక్షన్, మైండ్ బ్లోయింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలరించాయి. ‘మహాభారతంలో ధర్మాన్ని కాపాడటం కోసం లక్షలాది మంది తమ సమాధులను పునాధులుగా వేశారు.. మాచర్ల నియోజక వర్గంలో ధర్మాన్ని కాపాడటానికి నా సమాధిని పునాదిగా వెయ్యడానికి… నేను సిద్ధం’అని నితిన్ చెప్పిన డైలాగ్ హీరో పాత్రని ఎస్టాబ్లెస్ చేయడమే కాకుండా సినిమాపై మరింత క్యూరీయాసిటీని పెంచింది.
ఈ నెల 30న గుంటూరులో జరిగే భారీ పబ్లిక్ ఈవెంట్‌లో ‘మాచర్ల నియోజకవర్గం’ థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేస్తోంది. మాచర్ల నియోజకవర్గంను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి భారీ నిర్మిస్తున్నారు. నితిన్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రమిది. ఇందులో అంజలి స్పెషల్ నంబర్ రారా రెడ్డిలో సందడి చేయనుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.