AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devi Sri Prasad: దేవి శ్రీ ప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. మండిపడుతున్న నెటిజన్స్.. అసలు విషయం ఏంటంటే..

తెలుగు చిత్రపరిశ్రమలో ప్రస్తుతం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో దేవీ శ్రీ ప్రసాద్ ఒకరు. మాస్ సినిమాలకే కాకుండా.. క్లాస్ సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని

Devi Sri Prasad: దేవి శ్రీ ప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. మండిపడుతున్న నెటిజన్స్.. అసలు విషయం ఏంటంటే..
Devi Sri Prasad
Rajitha Chanti
|

Updated on: Mar 01, 2022 | 9:25 AM

Share

తెలుగు చిత్రపరిశ్రమలో ప్రస్తుతం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో దేవీ శ్రీ ప్రసాద్ ఒకరు. మాస్ సినిమాలకే కాకుండా.. క్లాస్ సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అనేక సూపర్ హిట్ చిత్రాలకు బాణీలు కట్టారు. అయితే ఎంతో ఫాలోయింగ్ ఉన్న దేవీ శ్రీప్రసాద్. గత కొద్ది రోజులుగా వివాదాస్పద కామెంట్స్ చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు. గతంలోనే దేవుళ్లపై వివాదాస్పద కామెంట్స్‌ చేసిన దేవీశ్రీ ప్రసాద్‌.. మరోసారి నోరు జారాడు. మాల ధారణను అమ్మాయిలతో ముడిపెట్టాడు. మీరు స్వామి మాల, మురుగన్‌ మాల వేసుకుంటూ పోతుంటారు.. మేము షీలా, మాల, సీతా గీతా అంటూ వెళ్తుంటామంటూ మరో కాంట్రవర్సీకి తెరతీశాడు. ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో డైరెక్టర్‌ తిరుమల కిషోర్‌ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు దేవి.

మంచి మంచి పాటలిచ్చాడు. అన్ని రకాల జానర్లలో ట్యూన్స్‌ చేశాడు. కాని ఈ నోటి దురుసేంటి? నోటికి ఎంతమాట వస్తే అంత అనేయడమేనా? గతంలోనూ దేవుళ్లపై ఇలాంటి మాటలే విసిరాడు. ఊ అంటావా పాటకి .. భక్తి గీతానికి లింక్‌ పెడుతూ ఓ పాట అందుకున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ ఫస్ట్‌ మూవీయే దేవి. ఓ భక్తి సినిమాతోనే ప్రస్తానం మొదలుపెట్టాడు డీఎస్పీ. ఆతర్వాత అంచలంచెలుగా ఎదిగాడు. ఎన్నో హిట్‌ ఆల్బమ్స్‌ ఇచ్చాడు. కాని మూలాలను మర్చిపోయాడు. ఆనాడు దేవి చేయకపోతే తన లైఫే వేరేలా ఉండేదని తెలుసా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

ప్రతీ ఏటా కొన్ని లక్షలమంది స్వామిమాల ధరించి.. ఎంతో పవిత్రంగా దీక్షలు చేసి.. శబరి వెళ్లి విరుముడులు ఇచ్చుకుని వస్తుంటారు. అయ్యప్ప మాలే కాదు.. మురుగన్‌మాల, సాయిబాబా మాల, ఆంజనేయస్వామి మాల, వెంకన్న మాల ఇలా చాలా రకాల భక్తిమాలలున్నాయి. హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. అలాంటి మాల ధారణపై ఇలాంటి వ్యాఖ్యలేమిటి దేవీ అంటున్నారు ఫ్యాన్స్‌. పుష్ప సినిమా మాట వివాదం సమయంలో ఎన్నో హిందూ సంఘాలు మండిపడ్డాయి. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కూడా దేవీశ్రీప్రసాద్‌పై మండిపడ్డారు. తన తప్పును తెలుసుకుని దేవిశ్రీ ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని… లేకపోతే తెలంగాణ ప్రజలు చెప్పులతో కొట్టి తరిమికొడతారని అని వార్నింగ్‌ ఇచ్చారు.

Also Read: Radhe Shyam: ప్రభాస్ అభిమానులకు మరో సర్‏ప్రైజ్.. రాధేశ్యామ్ ప్రమోషన్స్ షూరు అయ్యేది అప్పుడే..

Rashmika Mandanna: ఆ సినిమాలో కష్డపడితే.. ఈ మూవీ పిక్నిక్‏లా ఎంజాయ్ చేశా.. రష్మిక మందన్నా కామెంట్స్ వైరల్..

Mishan Impossible : తాప్సీ మిషన్ ఇంపాజిబుల్ విడుదలయ్యేది అప్పుడే.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..

Samantha: రష్యా దాడులపై స్పందించి నటి సమంత.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌.

ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!
రూ.6 లక్షల జీతంతో.. RBIలో ఉద్యోగాలు! రాత పరీక్ష లేకుండానే ఎంపిక
రూ.6 లక్షల జీతంతో.. RBIలో ఉద్యోగాలు! రాత పరీక్ష లేకుండానే ఎంపిక
రూ.40 లక్షలు దోచుకున్నాక మళ్ళీ అదే బెదిరింపు.. కట్ చేస్తే..
రూ.40 లక్షలు దోచుకున్నాక మళ్ళీ అదే బెదిరింపు.. కట్ చేస్తే..
ఏంటీ.. ధురంధర్ సినిమా డైరెక్టర్ భార్య తెలుగులో హీరోయినా.. ?
ఏంటీ.. ధురంధర్ సినిమా డైరెక్టర్ భార్య తెలుగులో హీరోయినా.. ?
సూర్యవంశీది ఆరంభం మాత్రమే.. అంతకుమించిన విధ్వంసం ఈ బుడ్డోళ్లు
సూర్యవంశీది ఆరంభం మాత్రమే.. అంతకుమించిన విధ్వంసం ఈ బుడ్డోళ్లు