Devara : దేవర ప్రభంజనం.. మూడు రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..
ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ సోలోగా నటించిన సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కొరటాల శివ దర్శకత్వం వచ్చిన దేవర సినిమా సంచలన విజయం సొంతం చేసుకుంది. తొలి రోజే దేవర సినిమా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర సినిమా దుమ్మురేపుతోంది. ఎక్కడ చూసిన దేవర హంగామానే కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర దేశాల్లోనూ దేవర సినిమా మేనియా కనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ సోలోగా నటించిన సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కొరటాల శివ దర్శకత్వం వచ్చిన దేవర సినిమా సంచలన విజయం సొంతం చేసుకుంది. తొలి రోజే దేవర సినిమా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్’ సమర్పణలో ‘యువ సుధా ఆర్ట్స్’ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌లో నటించి మెప్పించాడు. అలాగే దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.
ఇది కూడా చదవండి : ఏందో మావ.. నిన్న మొన్నటి చైల్డ్ ఆర్టిస్ట్‌లు.. ఇప్పుడు ఇలా షాక్‌లు ఇస్తున్నారు..!
అలాగే ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించి మెప్పించాడు. అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటించారు. దేవర సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తొలి పార్ట్‌లో చాలా ట్వీట్స్‌లు ఉంచి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేశాడు దర్శకుడు కొరటాల.
ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సింహాద్రి హీరోయిన్
ఇదిలా ఉంటే దేవర సినిమా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. దేవర సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ. 172 కోట్లు వసూల్ చేసింది. అలాగే సెకండ్ డే వరల్డ్ వైడ్ గా రూ. 249 కోట్లు వసూల్ చేసింది దేవర సినిమా. అదే విధంగా ఇప్పుడు మూడురోజులకు కలిపి రూ. 304కోట్లు వసూల్ చేసింది. ఈ మేరకు పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రానున్న రోజుల్లో ఈ సినిమా మరింత వసూల్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక దేవర సినిమాలో శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్, మురళి శర్మ, అజయ్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. అలాగే సముద్రంలోని సన్నివేశాలు, సొర చేప సీన్ ఆడియన్స్ చేత విజిల్స్ కొట్టించాయి.
ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ఈమె, ఆమె ఒక్కటేనా..? ఎవరో తెలిస్తే బిత్తరపోవాల్సిందే
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.