
కరోనా టైం నుంచి ఓటీటీ ఛానళ్లు డెవలప్‌మెంట్ మాములుగా లేదు. థియేటర్లతో సమానంగా ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్‌లు ప్రతీ వారం.. తమ వీక్షకుల కోసం కొత్త కొత్త సినిమాలను స్ట్రీమింగ్‌కు సిద్దం చేస్తున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే.. భాషతో సంబంధం లేదు.. నచ్చిన సినిమాలను మీకు నచ్చిన భాషలో చూసేయొచ్చు. తాజాగా ఆ కోవలోనే ఓ రొమాంటిక్ సినిమాను మీ ముందుకు తీసుకోచ్చేశాం. ఇది ఓ మరాఠీ మూవీ. ఇందులో భార్యకు తెలియకుండా.. మరో పెళ్లి చేసుకోవాలనుకుంటాడు భర్త. మొదట పెళ్లి ఇష్టం లేకపోయినా.. ఆ తర్వాత ఆమె అందానికి చూసి పడిపోతాడు భర్త. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. మరి చివరికి అతడి కోరిక నెరవేరిందా.? అసలు ఏం జరిగిందో.? ఈ స్టోరీ చూసేద్దాం..
ఇది చదవండి: బాలిక కడుపులో చిత్రవిచిత్ర శబ్దాలు.. భయంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఎక్స్‌రేలో
ఈ మరాఠీ మూవీ పేరు ‘తప్తపది’. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ‘దృష్టిదాన్’ కథ నుంచి ఈ మూవీ ప్రేరణ పొందింది. సచిన్ బలరామ్ నాగర్‌గోజే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. కశ్యప్ పరులేకర్, వీణా జామ్‌కర్, శృతి మరాఠే, నీనా కులకర్ణి, శరద్ పోంక్షే, అంబరీష్ దేశ్‌పాండే, అశ్విని ఎక్బోటే ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ 28 మార్చి 2014న విడుదలైంది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ విషయానికొస్తే.. మీరా, మాధవ్ చిన్నప్పటి ఫ్రెండ్స్. ఒకరొకరు ఇష్టపడతారు. మాధవ్ తన అత్త కొడుకే కావడంతో చిన్నప్పటి నుంచి క్లోజ్ గానే ఉంటుంది మీరా. అయితే ఆ తర్వాత మాధవ్ ఉన్నత చదువుల కోసం సిటీకి వెళ్ళిపోతాడు. డాక్టర్ డిగ్రీ పట్టా పొందుతాడు. ఇంతలో వాళ్ల కుటుంబాలు.. వీరికి పెళ్లి నిశ్చయిస్తారు. ఇద్దరికీ పెళ్లి కూడా జరిగిపోతుంది. అలాగే వీరి సంసారం కూడా సాఫీగా సాగిపోతుంది. మాధవ్ కూడా తనను చాలా ఇష్టంగా చూసుకుంటూ ఉండటంతో.. మీరా కూడా సంతోషిస్తుంది. అయితే అనూహ్యంగా మీరా కంటికి ఏదో జబ్బు వస్తుంది. దానిని నయం చేసేందుకు వివిధ రకాల మందులు వాడుతుంది. అయినా ఏప్రయోజనం ఉండదు. ఇలాంటి తరుణంలో మీరా అన్న ఇంటికి వస్తాడు. తన కళ్ళను మంచి డాక్టర్‌కు చూపించుకోమని చెప్తాడు. అయితే మాధవ్ కూడా డాక్టర్ కావడంతో.. అతడి మాటలు విని బాధపడతాడు. ఇదిలా ఉంటే.. కొద్దిరోజులకు చూపు కోల్పోతుంది మీరా. దానికి అందరూ కూడా మాధవ్‌ను నిందిస్తారు. అయితే మీరా మాత్రం తన భర్తను వెనకేసుకుని వస్తుంది. ప్రాణం పోయేవరకు తన భర్తతోనే ఉంటానని చెప్తుంది. మాధవ్ కూడా తన మీరాను చూసుకునేందుకు పనిమనిషిని ఏర్పాటు చేస్తాడు.
ఇది చదవండి: ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే వార్త.. విద్యుత్ ఛార్జీల పెంపు లేదు
ఈలోగా మాధవ్ మేనత్త అతడికి మరో పెళ్లి చేయాలనుకుంటుంది. సునంద అనే అమ్మాయితో పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తుంది. మొదట పెళ్లికి నిరాకరించిన మాధవ్.. ఆమె అందానికి ఫిదా అయిపోయి.. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయం తన భార్యకు తెలియకుండా చూసుకోవాలని జాగ్రత్త పడతాడు. మరి చివరికి మాధవ్ కోరిక నెరవేరిందా.? భార్యకు విషయం తెలిసిందా.? వారి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది.? అనే విషయాల కోసం సినిమాను మిస్ కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసేయండి.
ఇది చదవండి: భారత్‌లో ‘టెస్లా’ కార్లు ట్రెండింగ్.. ఎంట్రీ లెవెల్ మోడల్ ధర తెలిస్తే మైండ్ బ్లాంకే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి