AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Padukone: ‘ఇప్పుడు నీ ఇష్టం ఏమైంది.. డబ్బు కోసం ఏమైనా చేసేస్తావా?’

అప్పటి మాటలు.. ఇప్పుడు మంటలు రేపుతున్నాయి. నా ఇష్టం అంటూ గతంలో చెప్పుకొచ్చిన దీపికా పదుకొణె.. ఇప్పుడు అదే అంశం కాంట్రవర్సీకి కారణమైంది. లేటెస్ట్‌గా రణ్‌వీర్ సింగ్‌తో అబుదాబిలో యాడ్‌లో కనిపించిన దీపికా.. హిజాబ్‌ ధరించడంపై విమర్శల వర్షం కురుస్తోంది. ఇప్పుడు నీ ఇష్టం ఏమైంది.. డబ్బు కోసం ఏమైనా చేసేస్తావా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం కండిషన్స్ తెలుసుకోకుండా విమర్శలు చేయడం సరికాదని వాదిస్తున్నారు.

Deepika Padukone: 'ఇప్పుడు నీ ఇష్టం ఏమైంది.. డబ్బు కోసం ఏమైనా చేసేస్తావా?'
Deepika Ranveer
Ram Naramaneni
|

Updated on: Oct 10, 2025 | 8:29 PM

Share

బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ఇటీవ‌ల సినిమాల కంటే వివాదాల ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు ఈ బ్యూటీ. కొన్ని రోజుల క్రితం అటు ‘స్పిరిట్‌’ ఇటు ‘కల్కి సీక్వెల్‌ నుంచి దీపికాను తప్పించడం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ విషయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు మరింత సెన్సెషనల్‌గా మారాయి. అయితే ఈ సారి ఒక కమర్షియల్ యాడ్‌ ద్వారా ఈ బ్యూటీ సోషల్‌ మీడియా ట్రెండింగ్‌గా మారారు.

దీపిక తన భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి అబుదాబి టూరిజం బోర్డు రూపొందించిన ఒక యాడ్‌లో కనిపించారు. వీరిద్దరూ అబుదాబి అందాలను చూపిస్తూ, అక్కడి కల్చర్‌ అండ్‌ ట్రెడిషన్‌ని ప్రమోట్‌ చేశారు. మొదట్లో ఆ వీడియో సాధారణ ప్రమోషనల్‌ కంటెంట్‌లానే అనిపించింది. కానీ యాడ్‌లో దీపిక ధరించిన హిజాబ్‌, షేక్‌ జాయెద్‌ గ్రాండ్‌ మసీదులో ఉన్న సీన్లు ఇప్పుడు వివాదానికి కారణమయ్యాయి.

డబ్బుల కోసం ఏదైనా చేసేస్తావా?, హిందూ ఐకాన్‌గా ఉన్న నువ్వు హిజాబ్ ఎందుకు వేసుకున్నావు.. అంటూ సోషల్‌ మీడియాలో దీపిక పదుకొణె తీరుపై నెటిజన్లు మండిపడుతన్నారు. మరికొందరు మాత్రం అది కేవలం సాంస్కృతిక గౌరవ సూచకం మాత్రమేనని… రాద్దాంతం చేయొద్దంటూ ఆమెకు మద్దతు ఇస్తున్నారు. షేక్‌ జాయెద్‌ గ్రాండ్‌ మసీదుని సందర్శించాలంటే ఎవరైనా సరే హిజాబ్ ధరించాల్సిందేనని, అక్కడి షరతులు తెలుసుకోకుండా విమర్శలు చేయొద్దని దీపికకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ వివాదం జాతీయస్థాయిలో వైరల్‌ అవుతుండగా హ్యాష్‌ట్యాగ్‌ #BoycottDeepika కూడా ట్రెండ్‌ అవుతోంది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దీపిక… తాను ఎక్కడ పని చేసినా, అక్కడి సంస్కృతిని గౌరవించడం తన వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని తప్పుగా చూడకూడదని చెప్పుకొచ్చారు. ఇప్పటికే పలు వివాదాలతో రెండు భారీ ప్రాజెక్టులు వదులుకున్న దీపికా.. ఈ యాడ్‌ వివాదంపై ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.

కాగా ఈ పరిణామాల వేళ లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. దీపికా పదుకొణెకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. భారతదేశపు తొలి ‘మానసిక ఆరోగ్య అంబాసిడర్‌గా’ ఆమెను నియమించింది.

Follow Us
రాత పరీక్ష లేకుండా ఉద్యోగం పొందే ఛాన్స్.. APలో 529 ఉద్యోగాలు
రాత పరీక్ష లేకుండా ఉద్యోగం పొందే ఛాన్స్.. APలో 529 ఉద్యోగాలు
డెబ్యూ మ్యాచ్ లోనే చరిత్ర సృష్టించిన టీమిండియా కొత్త కుర్రాళ్లు
డెబ్యూ మ్యాచ్ లోనే చరిత్ర సృష్టించిన టీమిండియా కొత్త కుర్రాళ్లు
ఇదంతా పరమశివుని ఆశీర్వాదమే.. గుడ్‌న్యూస్ చెప్పిన రేణూ దేశాయ్
ఇదంతా పరమశివుని ఆశీర్వాదమే.. గుడ్‌న్యూస్ చెప్పిన రేణూ దేశాయ్
భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు
భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!
IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే అప్లై చేసుకోండి
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే అప్లై చేసుకోండి
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..