Rowdy Boys: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నారు ఆశిష్(శిరీష్ తనయుడు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. మా శిరీషన్న కొడుకు, సోదర సమానుడు ఆశిష్‌తో అప్పటి వరకు పరిచయం లేదు. ఇప్పుడు తను రౌడీ బాయ్స్ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. తన సినిమా ట్రైలర్‌ను నేను రిలీజ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ట్రైలర్ చూస్తుంటే ప్రేమ దేశం చూసిన ఎగ్జయిట్‌మెంట్ వచ్చింది. నాకే కాదు. మీ అందరికీ కూడా అలాంటి ఎగ్జయిట్‌మెంట్ కలుగుతుందని మనసారా నమ్ముతున్నాను అని చెప్పుకొచ్చారు.
తాజాగా ఈ సినిమాలోని డేట్ నైట్ అంటూ సాగే పాటను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లంచ్ చేశారు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, ట్రైలర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. అలాగే ఈ సినిమాలో అందాల అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :