AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddharth : దుమారం రేపుతున్న సిద్ధార్థ్‌ ట్వీట్.. ట్విట్టర్ ఇండియాకు లేఖ రాసిన మహిళా కమిషన్

హీరో సిద్ధార్థ్ కు వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆయన చాలా విషయాల్లో తనదైన శైలిలో స్పందించి వివాదంగా వివాదాలకు కేరాఫ్ గా మారుతున్నారు.

Siddharth : దుమారం రేపుతున్న సిద్ధార్థ్‌ ట్వీట్.. ట్విట్టర్ ఇండియాకు లేఖ రాసిన మహిళా కమిషన్
Siddharth
Rajeev Rayala
|

Updated on: Jan 10, 2022 | 7:08 PM

Share

Siddharth : హీరో సిద్ధార్థ్ కు వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆయన చాలా విషయాల్లో తనదైన శైలిలో స్పందించి వివాదంగా వివాదాలకు కేరాఫ్ గా మారుతున్నారు. ఇక ఇప్పటికే ఏపీలో సినిమా టికెట్ రేట్ల విషయంలోనూ సిద్ధార్థ్ స్పందించారు.మంత్రుల పై సెటైర్లు వేశారు సిద్దు. తాజాగా సైనా నెహ్వాల్ పై సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ ఆడవారిని అవమానపరిచేలా ఉన్నాంటూ శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేదితో సహ పలువురు ప్రముఖులు ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ఈ ట్వీట్ పై జాతీయ మహిళ కమిషన్ కూడా సిద్దార్థ్‏కు నోటిసులు జారీ చేసింది. ఈనెల 6న ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పంజాబ్ పర్యటనలో భాగంగా ఫిరోజ్ పూర్ కు వెళ్లారు. రోడ్డు మార్గంలో వెళ్తున్న ప్రధాని వాహనాలను రైతులు అడ్డిగించి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ భద్రతపై దేశవ్యాప్తంగా ప్రముఖులు ట్వీట్లు చేశారు. బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌, ఒలింపిక్‌ మెడలిస్ట్‌ సైనా నెహ్వాల్‌ కూడా మోదీ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. దీనికి రిప్లై ఇస్తూ.. హీరో సిద్ధార్థ్‌ చేసిన వ్యాఖ్యలే తాజాగా వివాదాస్పద మయ్యాయి. సిద్ధార్థ్‌ను విమర్శల పాలు చేశాయి.

సిద్ధార్థ్‌ చేసిన ట్వీట్ ఇంకా రగులుతూనే ఉంది. తన ఇంటెన్షన్ అది కాదంటూ ట్వీట్ చేసి.. తన పై వస్తున్న విమర్శలకు అడ్డుకట్టవేసే ప్రయత్నం ఈ హీరో చేసినప్పటికీ… మహిళా కమిషన్ మాత్రం ఈ ట్వీట్‌ను తేలిగ్గా తీసుకోవడం లేదు. సిద్ధార్థ్‌ ట్వీట్‌లోని పరుష పదాన్ని… పోల్చి విధానాన్ని అంత మరవడం లేదు. అందుకే తాజాగా సిద్ధార్థ్‌ ట్విట్టర్ అకౌంట్‌ను బ్లాక్ చేయమని ట్విట్టర్ ఇండియాకు లేఖ రాసింది మహిళా కమిషన్. హీరో సిద్ధార్థ్ ట్విట్టర్ అకౌంట్‌ను వెంటనే బ్లాక్ చేయాలని. తమ లేఖలో పేర్కొంది మహిళా కమిషన్. అలా అయితేనే మరొక్కరు ఇలా ట్వీట్‌ చేయరంటూ తెలిపింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ashu Reddy: సామ్ స్పెషల్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేసిన ఆషూ రెడ్డి.. నెట్టింట్లో ఫుల్ వెర్షన్ వీడియో ..

Deepthi Sunaina-Shanmukh: ఇంత ప్రేమ, బాండింగ్ ఎటు పోయింది.. దీప్తికి షణ్ముఖ్ చివరి ముద్దు వైరల్

Harish Shankar: నెటిజన్ పై డైరెక్టర్ హరీశ్ శంకర్ సీరియస్.. ఎందుకంటే..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!