Raja Raja Chora: ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ సినిమా..

'ఓటీటీలో 'రాజ రాజ చోర' విడుదలైన వెంటనే సామాజిక మాధ్యమాల్లో హీరో శ్రీవిష్ణు, హీరోయిన్లు సునైనా, మేఘా ఆకాష్ నటనను ప్రశంసిస్తూ...

Raja Raja Chora: ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న శ్రీవిష్ణు రాజ రాజ చోర సినిమా..
Raja Raja Chora

Edited By: Anil kumar poka

Updated on: Oct 15, 2021 | 10:54 AM

Raja Raja Chora: ‘ఓటీటీలో ‘రాజ రాజ చోర’ విడుదలైన వెంటనే సామాజిక మాధ్యమాల్లో హీరో శ్రీవిష్ణు, హీరోయిన్లు సునైనా, మేఘా ఆకాష్ నటనను ప్రశంసిస్తూ… అనేకమంది నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత అపూర్వమైన మార్కెటింగ్ క్యాంపెయిన్ చూసిన సినిమా ఇదేనని చెప్పాలి. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన చాలామంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ‘రాజ రాజ చోర’ చూడమని ప్రజలకు సూచిస్తున్నారు. కుటుంబ సభ్యులతో ఈ సినిమాచూడొచ్చు అంటూ దర్శకుడు శ్రీవాస్ అన్నారు. అలాగే సీనియర్ రచయిత గోపి మోహన్ ఈ సినిమా ఒక ‘జెమ్’ అని అభివర్ణించారు. ‘ఓ బేబీ’ దర్శకురాలు నందిని రెడ్డి సినిమా గురించి సోషల్ మీడియాలో “మీరు వెండితెరపై అద్భుతమైన ఈ సినిమాను చూడడం మిస్ అయితే… ఇప్పుడు డిజిటల్ తెరపై చూసే అవకాశం మీకు దగ్గరకు వచ్చింది” అని రాసుకొచ్చారు.

టీవీ, ప్రింట్ ప్రమోషన్‌ల నుండి డిజిటల్ మీడియా వరకు… ఇన్‌ఫ్లుయెన్సర్‌ల నుండి మీమ్ పేజీల వరకూ… సినిమాలో ఫన్నీ మూమెంట్స్ షేర్ చేయడం చూస్తుంటే ‘రాజ రాజ చోర’ ప్రజలు మెచ్చిన ఎంటర్టైనర్ అని స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమాను దసరా వీకెండ్ లో మరింత మంది చూసే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jabardasth Sai Teja: సాయి తేజ నుంచి ప్రియాంక సింగ్‌గా మారడానికి పెద్ద యుద్ధమే చేశా.. తండ్రి అంధుడు.. చూసేవారు లేరంటూ..

Manchu Manoj-Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో మంచు మనోజ్ కీలక భేటీ.. గంటకు పైగా చర్చ

Mahesh Babu: రాజమౌళితో సినిమాపై మహేశ్ ఫుల్ క్లారిటీ.. ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్