Shine Tom Chacko: దసరా విలన్ కారుకు ప్రమాదం.. తండ్రి మృతి.. నటుడి పరిస్థితి విషమం..

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. చాకో ఫ్యామిలీతో కలిసి ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో చాకో తండ్రి మృతి చెందారు. చాకోతో పాటు అతని సోదరుడికి తీవ్రగాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది.

Shine Tom Chacko: దసరా విలన్ కారుకు ప్రమాదం.. తండ్రి మృతి.. నటుడి పరిస్థితి విషమం..
Shine Tom Chacko

Updated on: Jun 06, 2025 | 10:26 AM

నటుడు షైన్ టామ్ చాకో వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో షైన్ తండ్రి సి.పి. చాకో మరణించారు. ఈ ఘటనలో షైన్, ఆయన తల్లి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆ వాహనంలో నటుడు, అతని సోదరుడు, తండ్రి, తల్లి, డ్రైవర్ ఉన్నారు. షైన్ కుటుంబం ఎర్నాకుళం నుండి బెంగళూరుకు వెళుతుండగా ముందు వెళ్తున్న లారీనీ కారు ఢీకొట్టింది.

ఈ ఘటనలో షైన్ రెండు చేతులు విరిగిపోయినట్లు సమాచారం. గాయపడినవారిని పాల్కోట్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పలు తెలుగు సినిమాల్లోనూ చాకో నటించారు. దసరా సినిమాలో విలన్‌గా నటించారు. ఇటీవల డ్రగ్స్‌ కేసులో అరెస్టై విడుదలైన చాకో.. ఇవాళ ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయన తండ్రి మృతి చెందగా.. షైన్, అతడి తల్లి గాయపడ్డారు. శుక్రవారం ఉదయం సేలం, బెంగుళూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

మలయాళంతోపాటు తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించాడు. తెలుగులో న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రంలో విలన్ పాత్రలో అదరగొట్టాడు. ఈ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే పలు వివాదాల్లో చిక్కుకున్నాడు షైన్. డ్రగ్స్ కేసుతోపాటు.. మలయాళీ నటి సైతం తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..