ఫ్లాష్ న్యూస్ : ‘దర్భార్’ రిలీజ్‌కు చిక్కులు..హైకోర్టు నోటీసులు

|

Dec 30, 2019 | 7:42 PM

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా  ఏఆర్‌ మురగదాస్ దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం ‘దర్భార్’. లేడీ సూపర్‌స్టార్ నయనతార ఈ మూవీలో హీారోయిన్‌గా నటిస్తోంది. ట్రైలర్, సాంగ్ ప్రోమోతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌కు వెళ్లాయి. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని  పొంగల్‌ కానుకగా జనవరి 9న విడుదల చేయాలని భావిస్తున్నారు మూవీ టీం. అయితే మూవీ రిలీజ్‌పై ఒక్కసారిగా నీలిమేఘాలు కమ్ముకున్నాయి. దర్భార్ చిత్ర విడుదలను నిలిపివేయాలంటూ మద్రాస్ హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది. […]

ఫ్లాష్ న్యూస్ : దర్భార్ రిలీజ్‌కు చిక్కులు..హైకోర్టు నోటీసులు
Follow us on

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా  ఏఆర్‌ మురగదాస్ దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం ‘దర్భార్’. లేడీ సూపర్‌స్టార్ నయనతార ఈ మూవీలో హీారోయిన్‌గా నటిస్తోంది. ట్రైలర్, సాంగ్ ప్రోమోతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌కు వెళ్లాయి. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని  పొంగల్‌ కానుకగా జనవరి 9న విడుదల చేయాలని భావిస్తున్నారు మూవీ టీం.

అయితే మూవీ రిలీజ్‌పై ఒక్కసారిగా నీలిమేఘాలు కమ్ముకున్నాయి. దర్భార్ చిత్ర విడుదలను నిలిపివేయాలంటూ మద్రాస్ హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ తమకు ఇవ్వాల్సిన రూ. 23. 7 కోట్లు బాకీ  చెల్లించడంలేదన్న కారణంతో మలేషియా చెందిన డిఎమ్‌వై క్రియేషన్స్ అనే సంస్థ కోర్టును ఆశ్రయించింది. రోబో 2.O , దర్బార్ సినిమాలకు గానూ లైకాకు కొంత ఫైనాన్స్ ఇచ్చినట్టుగా ఆ సంస్థ కోర్టుకు ఆధారాలు సమర్పించింది. పిటిషన్‌పై జనవరి 2 లోపు వివరణ ఇవ్వాలని లైకా నిర్మాణ సంస్థకి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.