Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకు చాలా భయమేస్తుంది.. నన్ను క్షమించండి.. ప్రణీత్ హనుమంతు వివాదంలో మరో నిందితుడు..

తండ్రీకూతుర్ల బంధాన్నే ప్రణీత్ హనుమంత్ కామెడీ కోసం ఎక్కువగా వాడుకోవడం. లేటెస్ట్‌గా పేదోడు జోక్స్, ఇన్‌సెప్ట్ హాస్యం అనే ఎపిసోడ్స్‌లో తండ్రీకూతుర్ల సంబంధంపై అగ్లీ కామెంట్లు చేస్తూ శునకానందం పొందాడు హనుమంతు. ఈ ఫనుమంతుడి దుస్సాహసాలపై సాయిధరమ్ తేజ్ కంటే ముందే చాలామంది అలర్ట్‌ అయ్యారు.

నాకు చాలా భయమేస్తుంది.. నన్ను క్షమించండి.. ప్రణీత్ హనుమంతు వివాదంలో మరో నిందితుడు..
Phanmantu Controversy
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 09, 2024 | 10:00 PM

ప్రణీత్ హనుమంతు.. ఇప్పుడు సోషల్ మీడియా తీవ్ర దుమారం రేపుతున్న పేరు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులారిటీ పెంచుకుని.. తనలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్లను పోగేసుకుని.. ఎదుటి వాళ్లపై నోటికొచ్చినట్టు పేలుతూ.. వల్గారిటీ, డబుల్ మీనింగ్ మాటలతో పేట్రేగిపోయాడు. అతడు పాల్పడ్డ నేరానికి, తండ్రీ-కూతుర్ల బంధంపై విషం చిమ్మినందుకు.. సమాజానికి అతడు చేస్తున్న డ్యామేజ్‌కి కఠినమైన శిక్షలు వెయ్యాలని, పోక్సో చట్టం కింద అరెస్టు చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి వాళ్లను సెలబ్రిటీగా మార్చింది ఎవరు..? మనం కాదా.. అనే ఆత్మపరిశీలనలు కూడా మొదలయ్యాయి. అసలు ఇలాంటి మనిషి తెలుగువాడైనందుకు మనమందరం చింతించాల్సిన పరిస్థితి అంటూ సోషల్ మీడియాలో సీరియస్ అవుతున్నారు.

పబ్లిక్ డొమైన్ సంగతి అటుంచితే.. ఇతగాడి ప్రైవేట్ బ్రాడ్‌కాస్ట్‌ ఛానల్‌లో ఏకంగా 11 వేలమంది ఫాలోయర్లున్నాయి. విచిత్రం ఏంటంటే.. తండ్రీకూతుర్ల బంధాన్నే ప్రణీత్ హనుమంత్ కామెడీ కోసం ఎక్కువగా వాడుకోవడం. లేటెస్ట్‌గా పేదోడు జోక్స్, ఇన్‌సెప్ట్ హాస్యం అనే ఎపిసోడ్స్‌లో తండ్రీకూతుర్ల సంబంధంపై అగ్లీ కామెంట్లు చేస్తూ శునకానందం పొందాడు హనుమంతు. ఈ ఫనుమంతుడి దుస్సాహసాలపై సాయిధరమ్ తేజ్ కంటే ముందే చాలామంది అలర్ట్‌ అయ్యారు. వీడ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు అంటూ ట్వీట్ పెట్టి సమాజాన్ని అలర్ట్ చేశాడు హీరో మంచు మనోజ్‌.

తాజాగా ఈ వివాదంలో ఇరుక్కున్న మరో నిందితుడు డల్లాస్ నాగేశ్వరరావు స్పందించాడు. తనకు చాలా భయమేస్తుందని.. తాను అసలు అలాంటి వ్యక్తిని కాదని.. ఆ వీడియోలో కూడా ఒక్క మాట అనలేదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ వీడియోను రిలీజ్ చేశాడు. “యూట్యూబ్, ఇన్ స్టా, ట్విట్టర్ లో సర్క్యులేట్ అవుతున్న వీడియోలో ఉన్న నలుగురిలో నేను ఒకడిని. ఆ వీడియోలో తనను చూసి ** ప్రిడేటర్ అని, చైల్డ్ అబ్యూస్ చేస్తా అని అంటున్నారు. కానీ నేను అది కాదు. ఆ వీడియోలో కూడా నేను ఒక మాట అనలేదు. ఆ వీడియోలో ఒక మాట అనలేదు కాబట్టి నా తప్పు లేదు అని నేను అనడం లేదు. నేను బయటకు వెళ్లిపోకుండా, ఆపకపోవడం, తప్పు జరుగుతున్నా ఆపకపోవడం , అక్కడే ఉండి ఏమి అనకపోవడం వాళ్లను ఎంకరేజ్ చేసినట్లు అయిపోయింది. కానీ నాకు ఎప్పుడూ ఆ దృష్టి లేదు. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నేను ఏ ఒక్కరి ఫ్యామిలీ కూడా ఏం అనలేదు. ఇది ఎటు పోతుందో తెలియడం లేదు. నాకు చాలా భయమేస్తుంది.. నన్ను క్షమించండి. వాళ్లను ఆపకపోవడం నా తప్పే. అందుకు క్షమించండి. అది రాంగ్ ప్లేస్, రాంగ్ టైం ” అంటూ ఓ వీడియో షేర్ చేశాడు.

క్షమించండి.. ప్రణీత్ హనుమంతు వివాదంలో మరో నిందితుడు..