Daaku Maharaaj: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న బాలయ్య.. డాకు మహారాజ్ 3 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే

నందమూరి నటసింహం బాలకృష్ణ..దర్శకుడు బాబి కాంబోలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతుల హీరోయిన్లుగా నటించగా..బాబీ డియేల్ విలన్‌ పాత్రలో నటించారు. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశి భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

Daaku Maharaaj: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న బాలయ్య.. డాకు మహారాజ్ 3 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
Daaku Maharaaj
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 15, 2025 | 6:25 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. బ్యాక్ బ్యాక్ హిట్స్ తో రాణిస్తున్నారు బాలయ్య. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాతో హిట్ అందుకున్న బాలకృష్ణ లేటెస్ట్ గా డాకు మహారాజ్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాడు. ఈ సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముందుగా రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదలైంది. మొదటి రెండు రోజుల్లో సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత రెండు రోజుల తర్వాత విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలైంది. ఈ మూడు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగానే రాబడుతుంది.

ఇది కూడా చదవండి :ఈ రెండు జెళ్ల సీతను గుర్తుపట్టారా.? ఆమెను ఇప్పుడు చూడగానే లవ్‌లో పడిపోతారు

జనవరి 12న ‘డాకు మహారాజ్’ సినిమా విడుదలైంది. కేవలం తెలుగులోనే ఈ సినిమా రిలీజ్ అయ్యింది. డాకు మహారాజ్ తొలిరోజు 25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా విడుదలైనప్పటి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరోసారి బాలకృష్ణ యాక్షన్ ఎంటర్టైనర్ తో ఇరగదీశారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డాకు మహారాజ్’ సినిమా మొదటి రోజు తర్వాత కూడా అద్భుతమైన బాక్సాఫీస్ రన్‌ను కొనసాగించి కేవలం మూడు రోజుల్లోనే భారీగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి హైప్ రా మావ..! పవన్ కళ్యాణ్ ఓజీలో ఈ క్రేజీ బ్యూటీతో స్పెషల్ సాంగ్

బాలయ్య సినిమా తొలి మూడు రోజుల్లో ఇండియా వైడ్ గా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ గా రూ. 92కోట్ల గ్రాస్ రాబట్టయింది.  తొలిరోజు 25 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఆ తర్వాత రెండు రోజుల్లో వరుసగా 12 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి 50 కోట్ల మార్కును దాటేసింది. పాన్ ఇండియా సినిమా కాకపోయినా కేవలం 3 రోజుల్లోనే 50 కోట్ల కలెక్షన్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు.  డాకు మహారాజ్’ సినిమాలో బాలకృష్ణ రెండు షేడ్స్‌లో కనిపించారు. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలయ్య సరసన  ఊర్వశి రౌతేలా, శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యాజైస్వాల్ నటించారు. అలాగే బాబీ డియోల్ విలన్ గా నటించి మెప్పించారు.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి