Tollywood: టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్.. ఆ యంగ్ హీరో సినిమాలో విలన్‏గా..

|

Oct 09, 2024 | 9:01 PM

అలాగే అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలోని బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ పాటకు స్టెప్పులేసి ఒక్కసారిగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తెలుగు సినిమాలకు వీరాభిమాని అయిన డేవిడ్ వార్నర్ పలు తెలుగు సినిమాలకు సంబంధించిన వీడియోలను అప్‌లోడ్ చేశాడు. దీంతో వార్నర్ తెలుగు చిత్రాల్లో నటిస్తే బాగుంటుందని చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేశారు.

Tollywood: టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్.. ఆ యంగ్ హీరో సినిమాలో విలన్‏గా..
David Warner
Follow us on

ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌తో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక బంధం ఏర్పడింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడిన వార్నర్‌.. అదే సమయంలో తెలుగు పాటలకు రీల్స్ చేస్తూ తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యాడు. కోవిడ్ సమయంలో వరుసగా తెలుగు సినిమాల పాటలు, డైలాగ్‌లతో రీల్స్, వీడియోలను నెట్టింట షేర్ చేస్తూ చాలా పాపులర్ అయ్యాడు. అలాగే అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలోని బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ పాటకు స్టెప్పులేసి ఒక్కసారిగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తెలుగు సినిమాలకు వీరాభిమాని అయిన డేవిడ్ వార్నర్ పలు తెలుగు సినిమాలకు సంబంధించిన వీడియోలను అప్‌లోడ్ చేశాడు. దీంతో వార్నర్ తెలుగు చిత్రాల్లో నటిస్తే బాగుంటుందని చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేశారు.

కొన్ని రోజుల క్రితం డైరెక్టర్ రాజమౌళితో కలిసి ఓ యాడ్ కూడా చేసిన సంగతి తెలిసిందే. డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాల్లో నటిస్తే ఎలా ఉంటుంది.. ? అతడిని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందనేది ఆ వీడియోలో ఫన్నీగా క్రియేట్ చేశారు. కానీ ఇప్పుడు వార్నర్ నేరుగా తెలుగు చిత్రంలో నటించనున్నాడు. కొద్ది రోజుల క్రితం, డేవిడ్ వార్నర్ తెల్లటి చొక్కా ధరించి, తుపాకీ పట్టుకుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత కూడా డేవిడ్ వార్నర్ సినిమాలో నటిస్తున్నాడనే వార్త వైరల్ గా మారింది. అయితే ఏ సినిమాలో నటిస్తాడనే విషయంపై స్పష్టత రాలేదు. కొంతమంది ‘పుష్ప2’ అన్నారు. అయితే అది నిజం కాదు.

తాజా సమాచారం ప్రకారం నితిన్ నటిస్తున్న ‘రాబిన్‌హుడ్’ చిత్రంలో డేవిడ్ వార్నర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ విలన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపిస్తాడని అంటున్నారు. అతడితో యాక్షన్ సన్నివేశాలతోపాటు కామెడీ సీన్స్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.