Thandel: ఆ ఒక్క సీన్ సినిమాకే హైలెట్.. థియేటర్లు దద్దరిల్లేలా చేయనున్న చైతూ.. తండేల్ పై క్రేజీ న్యూస్..
ముఖ్యంగా సాయి పల్లవి నటిస్తుందని తెలియడంతో తండేల్ చిత్రంపై అంచనాలు పెరిగాయి. విరాట పర్వం మూవీ తర్వాత చాలా కాలం గ్యాప్ ఇచ్చిన సాయి పల్లవి మరోసారి చైతూ సినిమాకు ఓకే చెప్పడంతో తండేల్ మూవీ పై క్రేజ్ ఏర్పడింది. ఎందుకంటే కథలో బలం ఉంటే తప్ప సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు అనే టాక్ జనాల్లో ఉండిపోయింది. రియాలిస్టిక్ సంఘటన ఆధారంగా వస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.
చాలాకాలం గ్యాప్ తర్వాత నాగచైతన్య నటిస్తున్న సినిమా తండేల్. చందూ మొండేటీ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టులో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తుంది. లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ తర్వాత మరోసారి ఈ క్రేజీ జోడి జతకట్టింది. దీంతో తండేల్ సినిమాపై మరింత క్యూరియాసిటీ నెలకొంది. చైతూ, సాయి పల్లవి జోడిగా ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సాయి పల్లవి నటిస్తుందని తెలియడంతో తండేల్ చిత్రంపై అంచనాలు పెరిగాయి. విరాట పర్వం మూవీ తర్వాత చాలా కాలం గ్యాప్ ఇచ్చిన సాయి పల్లవి మరోసారి చైతూ సినిమాకు ఓకే చెప్పడంతో తండేల్ మూవీ పై క్రేజ్ ఏర్పడింది. ఎందుకంటే కథలో బలం ఉంటే తప్ప సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు అనే టాక్ జనాల్లో ఉండిపోయింది. రియాలిస్టిక్ సంఘటన ఆధారంగా వస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.
మత్య్సకారుల జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ చందూ మొండేటి. ఈ మూవీ గురించి నిత్యం ఏదోక వార్త ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఈ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతుంది. ఇందులో లవ్ స్టోరీతోపాటు అంతకు మించి దేశభక్తి పెంచే సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు. అలాగే గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీన్స్ ఉంటాయని టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా వర్షంలో వచ్చే ఫైట్ సీన్ సినిమాకే హైలెట్ కానుందని… ఈ సన్నివేశంలో ఇదివరకు ఎన్నడూ చూడని చైతూ కనిపించనున్నాడని అంటున్నారు. ఈ ఫైట్ సీన్ వచ్చినప్పుడు అరుపులు, విజిల్స్ తో థియేటర్లు దద్ధరిల్లడం ఖాయమని టాక్ వినిపిస్తుంది. దీంతో ఇప్పుడు తండేల్ సినిమాపై మరింత హైప్ ఏర్పడింది.
కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే లొకేషన్స్ నుంచి రిలీజ్ అయిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో చైతూ మాస్ రగ్గడ్ లుక్ లో కనిపించనుండగా.. సాయి పల్లవి పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. ఇదివరకు విడుదలైన టీజర్ చూస్తుంటే మరోసారి సాయి పల్లవి, చైతూ జోడి సూపర్ హిట్ అందుకోనుందని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.