Pushpa 2: అల్లు అర్జున్ ఉగ్రరూపం.. త్రిశూలంతో పుష్పరాజ్ భీభత్సం.. కొత్త పోస్టర్ అదిరిపోయింది..

ఈరోజు రష్మిక బర్త్ డే సందర్భంగా విడుదలైన శ్రీవల్లీ పోస్టర్ ఆకట్టుకుంది. ఇక ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప 2 టీజర్ రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ క్రమంలోనే పుష్ప 2 ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. వరుసగా మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ రోజు రోజుకీ హైప్ పెంచుతున్నారు.

Pushpa 2: అల్లు అర్జున్ ఉగ్రరూపం.. త్రిశూలంతో పుష్పరాజ్ భీభత్సం.. కొత్త పోస్టర్ అదిరిపోయింది..
Pushpa 2
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 05, 2024 | 8:14 PM

మోస్ట్ అవైటేడ్ మూవీ పుష్ప 2. గతంలో సెన్సెషన్ అయిన పుష్ప చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా, సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటివరకు కేవలం బన్నీ పోస్టర్, చిన్న గ్లింప్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఇక ఈరోజు రష్మిక బర్త్ డే సందర్భంగా విడుదలైన శ్రీవల్లీ పోస్టర్ ఆకట్టుకుంది. ఇక ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప 2 టీజర్ రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ క్రమంలోనే పుష్ప 2 ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. వరుసగా మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ రోజు రోజుకీ హైప్ పెంచుతున్నారు. కాసేపటి క్రితం ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ రివీల్ చేశారు.

ఇక తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో పుష్పరాజ్ అమ్మవారి గెటప్‏లో కనిపిస్తుండగా.. ఒక చేత్తో త్రిశూలం పట్టుకుని.. మరో చేతిలో శంఖం ఊదుతున్నట్లు కనిపించాడు. ఇక బన్నీ ముఖం కనిపించకుండా పూర్తిగా కుంకుమతో నింపేశారు. ఆ పోస్టర్ లో బన్నీ కళ్లు ఎరుపెక్కి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉండి.. ఇప్పుడు వరుస పోస్టర్లతో ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. తాజాగా రిలీజ్ అయిన పుష్పరాజ్ ఉగ్రరూపంపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. మరోవైపు అల్లు అర్జున్, సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ ముగ్గురూ కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన సంచలన నేపథ్య సంగీతానికి రూపకల్పన చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.అయితే ఈ బీజీఎం ఏప్రిల్ 8న టీజర్ లో వినొచ్చని తెలిపింది చిత్రయూనిట్. పుష్ప చిత్రానికి దేవి అందించిన మ్యూజిక్ ఏరేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాకు సైతం అదే మ్యాజిక్ రిపీట్ కావడం ఖాయమని అంటున్నారు.ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.