AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devara Movie: ఇది కదా కావాల్సింది.. ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు అతిథిగా మహేష్.. ?

ఆదిపురుష్ సినిమా తర్వాత దేవర చిత్రంలో మరోసారి విలన్ పాత్రలో కనిపించనున్నాడు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్. ఇప్పటివరకు విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీ పై ఎక్స్‏పెక్టేషన్స్ అమాంతం పెంచేశాయి. ముఖ్యంగా సముద్రంలో షార్క్‏పై ఎన్టీఆర్ సవారీ షాట్ అదిరిపోయింది. దీంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ పై చూసేద్ధామా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Devara Movie: ఇది కదా కావాల్సింది.. 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు అతిథిగా మహేష్.. ?
Mahesh, Devara
Rajitha Chanti
|

Updated on: Sep 14, 2024 | 10:48 AM

Share

భారీ అంచనాల మధ్య సినీ ప్రియుల ముందుకు రాబోతున్న చిత్రం ‘దేవర’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రూపొందించిన ఈ సినిమా మరో రెండు వారాల్లో థియేటర్లలో సందడి చేయనుంది. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా భారీ అంచనాల మధ్య నిర్మించిన ఈసినిమాలో బీటౌన్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. ఆదిపురుష్ సినిమా తర్వాత దేవర చిత్రంలో మరోసారి విలన్ పాత్రలో కనిపించనున్నాడు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్. ఇప్పటివరకు విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీ పై ఎక్స్‏పెక్టేషన్స్ అమాంతం పెంచేశాయి. ముఖ్యంగా సముద్రంలో షార్క్‏పై ఎన్టీఆర్ సవారీ షాట్ అదిరిపోయింది. దీంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ పై చూసేద్ధామా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళం భాషలలోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా దేవర చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు తారక్. మొన్నటి వరకు ముంబైలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ నార్త్ అడియన్స్‏కు దగ్గరయ్యారు. ఇటీవలే హైదరాబాద్ తిరిగి వచ్చిన ఎన్టీఆర్.. మరోసారి ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇప్పటికే యంగ్ హీరోస్ సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్‏లు ఇద్దరూ తారక్‏తో ప్రత్యేక చిట్ చాట్ చేసినట్లు ఓ ఫోటో నెట్టింట లీక్ అయ్యింది. ఇందులో తారక్ ను ఇరుకున పెట్టేందుకు అనేక ప్రశ్నలు అడగ్గా.. తెలివిగా ఆన్సర్ ఇచ్చారు ఎన్టీఆర్. ఇదిలా ఉంటే.. ఇప్పుడు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

అదేంటంటే.. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు ముఖ్య అతిథిగా రావాలని మహేష్ బాబును డైరెక్టర్ కొరటాల శివ ఆహ్వానించారనే టాక్ వినిపిస్తుంది. ఈ విషయం గురించి ఇప్పటికే కొరటాల శివ, మహేష్ మధ్య చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ దేవర ప్రీ రిలీజ్ వేడుకకు మహేష్ వస్తే మరింత హైప్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చాలా కాలం తర్వాత ఎన్టీఆర్, మహేష్ ఒకే స్టేజ్ పై కనిపించనుండడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మరీ చూడాలి దేవర వేడుకకు మహేష్ వస్తారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది. దేవర ప్రీ రిలీజ్ వేడుక సెప్టెంబర్ 22న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అమ్మమ్మల కాలం నాటి పాయ.. ఇలా తయారు చేస్తే గిన్నె లేపాల్సిందే
అమ్మమ్మల కాలం నాటి పాయ.. ఇలా తయారు చేస్తే గిన్నె లేపాల్సిందే
అమెరికా నుంచి భారత్‌కు చేరిన కోట్ల విలువైన 'సాంస్కృతిక సంపద'!
అమెరికా నుంచి భారత్‌కు చేరిన కోట్ల విలువైన 'సాంస్కృతిక సంపద'!
రాజస్థాన్ కెప్టెన్‎కు ఏడాది జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా ?
రాజస్థాన్ కెప్టెన్‎కు ఏడాది జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా ?
రెట్రో స్టైల్‌ బైకులను ఇష్టపడేవారికి గుడ్‌న్యూస్‌!
రెట్రో స్టైల్‌ బైకులను ఇష్టపడేవారికి గుడ్‌న్యూస్‌!
ఏపీ పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్ చెక్ చేసుకోండి..
ఏపీ పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్ చెక్ చేసుకోండి..
బూమ్రా వేసి బౌలింగు వల్ల ముంబైకి ఎన్ని కోట్లు నష్టమో తెలుసా ?
బూమ్రా వేసి బౌలింగు వల్ల ముంబైకి ఎన్ని కోట్లు నష్టమో తెలుసా ?
ఎండలో 5 లీటర్ల నీళ్లు తాగిన యువకుడు.. కట్ చేస్తే ICUలోకి! షాకింగ్
ఎండలో 5 లీటర్ల నీళ్లు తాగిన యువకుడు.. కట్ చేస్తే ICUలోకి! షాకింగ్
స్టార్ హీరో కూడా సూర్యకాంతం నటనకు ఫిదా అయ్యాడు..
స్టార్ హీరో కూడా సూర్యకాంతం నటనకు ఫిదా అయ్యాడు..
భారత్ మ్యాప్ తారుమారు చేసిన నేపాల్ ఎయిర్‌లైన్స్..!
భారత్ మ్యాప్ తారుమారు చేసిన నేపాల్ ఎయిర్‌లైన్స్..!
బలానికి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎండాకాలం బెస్ట్ లడ్డు ఇదే..
బలానికి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎండాకాలం బెస్ట్ లడ్డు ఇదే..