
ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలన విజయం సాధించిన చిన్న సినిమా కోర్ట్. న్యాచురల్ స్టార్ నాని పరిమిత బడ్జెట్ లో నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది మార్చిలో విడుదలై భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా రోషన్, శ్రీదేవి నటించగా ప్రియ దర్శి, శివాజీ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. ఈ కోర్టు సినిమాతోనే విశాఖపట్నం కుర్రాడు రామ్ జగదీశ్ దర్శకుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. తన టేకింగ్ తో మెగాస్టార్ చిరంజీవి తదితర ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా ఈ డైరెక్టర్ పెళ్లిపీటలెక్కాడు. కార్తీక అనే అమ్మాయతో కలిసి వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. ఆదివారం (ఆగస్టు 17) రాత్రి విశాఖ పట్నంలో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ‘కోర్ట్’ మూవీ యాక్టర్స్ రోషన్, శ్రీదేవి, శివాజీతో పాటు నిర్మాత ప్రశాంతి కూడా హాజరయ్యారు. రామ్ జగదీశ్ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను నటుడు శివాజీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. దీంతో అవి కాస్తా నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ,నెటిజన్లు రామ్ జగదీప్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా రామ్ జగదీశ్ ది పెద్దల కుదిర్చిన వివాహ మని తెలుస్తోంది. వధువు పేరు కార్తీక అని, ఆమె ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదని తెలుస్తోంది. అయితే కార్తీక గురించి మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక రామ్ జగదీశ్ తన తర్వాతి సినిమాను కూడా హీరో నాని నిర్మాణంలో తీయనున్నాడని తెలుస్తోంది. ఇందులో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించునున్నాడని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
Happy Married life to my Dear Court Director #RamJagadeesh🥳
Wishing you a lifetime of togetherness& happiness ! pic.twitter.com/N9f4IKFWwY
— Sivaji (@ActorSivaji) August 18, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.