ఈ గుడిలో మొక్కుకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది.. శ్రీదేవి చెప్పిన ఆ పవర్ ఫుల్ టెంపుల్ ఎక్కడంటే?

ఇటీవల చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా కోర్ట్. న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీలో హర్ష్‌ రోషన్‌, శ్రీదేవి జంటగా నటించారు. అలాగే ప్రియదర్శి, శివాజీ, రోహిణి, హర్షవర్ధన్‌ కీలక పాత్రలు పోషించారు.

ఈ గుడిలో మొక్కుకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది.. శ్రీదేవి చెప్పిన ఆ పవర్ ఫుల్ టెంపుల్ ఎక్కడంటే?
Sridevi Appala

Updated on: Apr 21, 2025 | 9:51 PM

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవాలంటే చాలా అదృష్టముండాలి. అందరికీ ఈ రికార్డు సాధ్యం కాదు. అయితే మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది కోర్ట్ సినిమా హీరోయిన్ శ్రీదేవి అప్పాల. కాకినాడకు చెందిన ఈ అమ్మాయి సోషల్ మీడియా రీల్స్ తో బాగా ఫేమస్ అయ్యింది. ఈ క్రమంలోనే కోర్టు సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. అంతేకాదు ఏకంగా డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ సినిమాను ఖాతాలో వేసుకుంది. మార్చి 14న విడుదలైన ఈ మూవీ ఏకంగా రూ.66 కోట్లకు పైగా వసూలు చేసింది. కోర్ట్ సినిమా విజయంతో తెగ ఆనందపడిపోతోంది నటి శ్రీదేవి. ఈ క్రమంలోనే కోనసీమ తిరుమలగా పిలుచుకునే వాడపల్లి వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్లిందీ అందాల తార. అక్కడ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడితో తన అనుబంధాన్ని పంచుకుంది. ‘ మంచి సినిమా ఛాన్స్‌ రావాలని వాడపల్లి వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను. ఇందుకోసం ఏడువారాలపాటు ఆలయానికి వస్తానని మొక్కుకున్నాను. కానీ దేవుడు నా మొర ఆలకించి రెండోవారానికే నాకు కోర్ట్‌ సినిమా ఆఫర్‌ వచ్చింది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇప్పుడు ఏడువారాలు పూర్తయ్యాయి. ఒక పూజ చేయించుకునేందుకు ఆలయానికి వచ్చాను. ఇక్కడ మనం ఏం అనుకున్నా నెరవేరుతుంది. నాకు చాలా మంచి జరిగింది. నేను కోరుకున్నవన్నీ జరిగాయి’ అని చెప్పుకొచ్చింది శ్రీదేవి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

 

ఇవి కూడా చదవండి

ఇంతకు శ్రీదేవి చెప్పిన ఆలయం ఎక్కడుందో తెలుసా? ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం మండలంలోని వాడపల్లిలో ఈ గుడి ఉంది.

వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి..


ఇక కోర్ట్ సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీతోనే రామ్ జగదీష్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. నాని సమర్పణలో అతడి అక్క ప్రశాంతి తిపిర్నేని నిర్మించింది. విజయ్‌ బుల్గనిన్‌ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు ఓటీటీలోనూ సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.

మెగాస్టార్ చిరంజీవితో కోర్ట్ సినిమా టీమ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.