
నేచురల్ నాని ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.. ఇటీవలే కోర్ట్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నాని. టీనేజ్ లవ్ స్టోరీతో పాటు ఫొక్సో చట్టం నేపథ్యంలో ఈ కథను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి, సాయి కుమార్ తో పాటు హర్ష్ రోషన్, కాకినాడ శ్రీదేవి కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ సినిమా మంచి విజయం సాధించిన తర్వాత కాకినాడ శ్రీదేవికి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కోర్ట్ సినిమా తర్వాత శ్రీదేవికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఈ చిన్నదాని వయసు ఇంకా టీనేజ్ కావడంతో తన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది. ఇటీవలే తమిళ్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది శ్రీదేవి.
ఈ సినిమా ఇటీవలే పూజాకార్యక్రమంతో మొదలైంది ఈ సినిమా.. అలాగే ఈ చిన్నదానికి తెలుగులోనూ మంచి ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది. తనకు చాలా సినిమా ఆఫర్స్ వస్తున్నాయని తెలిపింది. అలాగే ఒకరు ఇద్దరు తెలుగు యంగ్ హీరోల సినిమాల్లోనూ అవకాశం వచ్చిందని తెలిపింది. లవ్ స్టోరీ కథల్లో నటించాలని నాకు ఆఫర్స్ వచ్చాయి. కానీ నాకు ఇప్పుడే అలాంటి సినిమాల్లో నటించలేదు అని తెలిపింది.
నేను ఇప్పుడే కెరీర్ మొదలు పెట్టా.. హీరోయిన్ అవ్వడం కోసమే నేని ఇండస్ట్రీలోకి వచ్చాను. కానీ నా వయసు తగ్గ పాత్రలు చేస్తాను.. యాక్టింగ్ మీద పట్టు వచ్చాక అన్ని రకరాల పాత్రలు చేయాలని ఉంది. మంచి పాత్రలు చేసి పేరు తెచ్చుకోవాలనిఉంది అంటూ చెప్పుకొచ్చింది శ్రీదేవి. ఇక ఈ చిన్నది కోర్ట్ సినిమాలో జాబిల్లి పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది. ఇప్పుడు తమిళ్ సినిమాలో ఎలాంటి పాత్ర చేస్తుందో చూడలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.