దారుణంగా మోసం చేశారు.. ఆ స్టార్ హీరో సినిమాలో అనవసరంగా నటించా.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
ఇండస్ట్రీలో ఎంతో మంది యంగ్ హీరోయిన్స్ తమ టాలెంట్ తో రాణిస్తున్నారు. కొంతమంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేస్తున్నారు. అలాగే మరికొంతమంది సెకండ్ హీరోయిన్స్ కూడా క్లిక్ అవ్వకపోవడంతో స్పెషల్ సాంగ్స్ చేసి మెప్పిస్తున్నారు.

సినిమాల్లో మంచి పాత్ర దొరికితే తమ టాలెంట్ చూపించడానికి హీరో హీరోయిన్స్ రెడీ గా ఉంటారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరికితే చెలరేగిపోయే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కేవలం హీరోయిన్స్ మాత్రమే కాదు సహాయక పాత్రలు చేసే నటీమణులు కూడా చాలా మంది ఉన్నారు. అయితే కొన్నిసార్లు ఊహించని విధంగా చాలా మంది నటించిన సీన్స్ ఎడిటింగ్ లో లేచిపోతూ ఉంటాయి. గతంలో చాలా మంది హీరోయిన్స్, సెకండ్ హీరోయిన్స్ తమ పాత్రను ఎడిటింగ్ లో కట్ చేశారని తెలిపారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ కూడా స్టార్ హీరో సినిమాలో తన పాత్రను ఎడిటింగ్ లో చాలా వరకు కట్ చేశారని తెలిపింది. అంతే కాదు మరోసారి ఇలాంటి పాత్రలు చేయను అని చెప్తూ ఎమోషనల్ అయ్యింది ఆ ముద్దుగుమ్మ ఇంతకూ ఆ చిన్నది ఎవరో తెలుసా.?
ఇది కూడా చదవండి : రిలీజై 7ఏళ్ళైనా ఓటీటీని ఊపేస్తున్న సినిమా.. చూస్తే సుస్సూ పోసుకోవాల్సిందే
ఇండస్ట్రీలో మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్స్ అయినా వారు చాలా మంది ఉన్నారు. వారిలో నందిని రాయ్ ఒకరు. హీరోయిన్ గా సినిమాలు చేసి ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా మారింది అందాల భామ నందిని రాయ్. అంతే కాదు ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ షో లోనూ పాల్గొంది. నాని హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! అచ్చం మీరాజాస్మిన్‌లానే ఉందే.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నందిని రాయ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. నందిని మాట్లాడుతూ.. ఓ స్టార్ హీరో సినిమాలో తన పాత్రను చాలా వరకు ఎడిటింగ్ లో కట్ చేశారని తెలిపింది. నందిని రాయ్ దళపతి విజయ్ నటించిన వారసుడు సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో శ్రీకాంత్ తో ఎఫైర్ పెట్టుకొని ఫ్యామిలీని సపరేట్ చేసే క్యారెక్టర్ లో నటించింది నందిని. అయితే ఈ సినిమాలో తన పాత్రను కట్ చేశారని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. సినిమా స్టోరీ చెప్పినప్పుడు తన పాత్ర చాలా పెద్దగా ఉంటుందని చెప్పారు. అలాగే నా సపరేట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత నా సీన్స్ మొత్తం కట్ చేశారు. సినిమా మొత్తం మీద 2 నిమిషాలే నా పాత్రఉంచారు. అది నన్ను చాలా బాధపెట్టింది. ఆ సినిమా వల్ల చాలా నెగిటివ్ అయ్యాను. ఇంకోసారి ఇలాంటి సినిమాలు చేయను అంటూ ఎమోషనల్ అయ్యింది నందిని రాయ్.
ఇది కూడా చదవండి : స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన బ్యూటీ.. ఒక్క యాక్సిడెంట్‌తో అంతా రివర్స్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








