Santhanam: హిందూ సంఘాల ఆందోళనలతో దిగొచ్చిన ‘డీడీ’.. ‘శ్రీనివాస గోవింద’ పేరడీ సాంగ్ తొలగింపు

కోలీవుడ్ స్టార్ కమెడియన్ కమ్ హీరో సంతానం నటించిన లేటెస్ట్ సినిమా డీడీ నెక్స్ట్ లెవెల్. శుక్రవారం (మే16) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాలోని గోవింద నామాలతో రూపొందించిన ర్యాప్ సాంగ్ పై వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే

Santhanam: హిందూ సంఘాల ఆందోళనలతో దిగొచ్చిన డీడీ.. శ్రీనివాస గోవింద పేరడీ సాంగ్ తొలగింపు
Santhanam

Updated on: May 16, 2025 | 5:38 PM

తమిళ నటుడు సంతానం ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘డెవిల్స్‌ డబుల్‌ (డీడీ)నెక్ట్స్‌ లెవెల్‌’. నిహారిక ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ, ఆర్యకు చెందిన షో పీపుల్‌ సంస్థ కలిసి నిర్మించిన చిత్రం శుక్రవారం (మే 16) థియేటర్లలో రిలీజైంది. అయితే విడుదలకు ముందే ఈ సినిమాపై వివాదం తలెత్తిన సంగతి తెలిసిదే. ఈ సినిమాలో గోవింద నామాలతో ర్యాప్ సాంగ్ రూపొందిండంపై శ్రీవారి భక్తులు మండి పడ్డారు. ‘శ్రీనివాస గోవింద’ పాటను పేరడీ చేసి సినిమాలో వినియోగించడంతో హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా తిరుపతిలో ఈ వివాదంపై అనేక హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఇక టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి చిత్ర కథానాయకుడు సంతానం, నిర్మాణ సంస్థ, తమిళనాడు సెన్సార్ బోర్డు కు నోటీసులు జారీ చేశారు. అంతే కాదు 100 కోట్ల పరువు నష్ట దావా కూడ వేశారు. అలాగే ఈ పాటను సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా హిందూ సంఘాల ఆందోళనలతో డీడీ నెక్స్ట్ లెవెల్ టీమ్ దిగొచ్చింది.

తీవ్ర విమర్శలు రావడంతో డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమా పాటను తొలగిస్తూ చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్ తో పాటు సినిమాలో సైతం పాటను తొలగిస్తామని ప్రకటించింది. ఇప్పటికే యూట్యూబ్ లో పాటను ప్రైవేట్‌లో పెట్టేసింది మూవీ టీమ్. డీడీ నెక్ట్స్ లెవల్ సినిమాకు ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో సంతానం రివ్యూయర్ గా నటిస్తున్నాడు. గీతికా తివారీ హీరోయిన్ గా నటించింది. అలాగే గౌతమ్ వాసుదేవ్ మేనన్, సెల్వ రాఘవన్, నిళళ్ గల్ రవి, కస్తూరి శంకర్, రెడిన్ కింగ్ స్లే, యషికా ఆనంద్, రాజేంద్రన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

డీడీ నెక్ట్స్ లెవెల్ మూవీ థియేటర్ లో హీరో సంతానం.. వీడియో..

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.