Nani 30 : నాని 30 గురించి క్రేజీ టాక్.. నేచురల్ స్టార్ నయా మూవీ టైటిల్ ఇదేనా..?

మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ పాత్రలో నాని నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. నాని కెరీర్ లో 30వ సినిమాగా ఈ మూవీ రాబోతుంది.

Nani 30 : నాని 30 గురించి క్రేజీ టాక్.. నేచురల్ స్టార్ నయా మూవీ టైటిల్ ఇదేనా..?
Nani 30

Updated on: Apr 20, 2023 | 3:02 PM

నేచురల్ స్టార్ నాని రీసెంట్ గా దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ పాత్రలో నాని నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. నాని కెరీర్ లో 30వ సినిమాగా ఈ మూవీ రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింమ్ప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ వీడియో ద్వారా సినిమా థీమ్ ను వివరించారు. తండ్రి కూతురుకి మధ్య జరిగే కథ ఇది అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ సినిమాకు హాయ్ నాన్న అనే టైటిల్ ను ఖరారు చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో కియారా ఖన్నా నాని కూతురిగా నటిస్తోంది.

ఇక ఈ సినిమా మజిలి, నిన్ను కోరి లాంటి సినిమా అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాతో నాని మరో హిట్ కొట్టడం ఖాయం అని అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమాకు శౌర్యవ్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమానుంచి క్రేజీ అప్డేట్స్ ను త్వరలోనే ఇవ్వనున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us