ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్​పై క్రిమినల్​ కేసు నమోదు…

బాలీవుడ్​ ప్రముఖ నిర్మాత, బాలాజీ టెలీఫిలింస్ అధినేత్రి ఏక్తా కపూర్​పై క్రిమినల్​ కేసు నమోదైంది. ఇటీవలే ఆమె నిర్మించిన ఓ వెబ్​సిరీస్​లో ఆర్మీ దుస్తులను, చిహ్నాన్ని అభ్యంతరకర రీతిలో చిత్రీకరించారని ఆరోపిస్తూ ముంబై మేజిస్ట్రేట్​ కోర్టులో కేసు దాఖలైంది.

ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్​పై క్రిమినల్​ కేసు నమోదు...
Follow us

|

Updated on: Jul 16, 2020 | 9:30 AM

బాలీవుడ్​ ప్రముఖ నిర్మాత, బాలాజీ టెలీఫిలింస్ అధినేత్రి ఏక్తా కపూర్​పై క్రిమినల్​ కేసు నమోదైంది. ఇటీవలే ఆమె నిర్మించిన ఓ వెబ్​సిరీస్​లో ఆర్మీ దుస్తులను, చిహ్నాన్ని అభ్యంతరకర రీతిలో చిత్రీకరించారని ఆరోపిస్తూ ముంబై మేజిస్ట్రేట్​ కోర్టులో కేసు దాఖలైంది. ప్రముఖ బిగ్​బాస్​ కంటెస్టెంట్​ వికాస్​ పథక్​ ఈ ఫిర్యాదు చేశాడు. దీనిపై ఆగస్టు 24న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది. ఏక్తా కపూర్​తో పాటు ఓటీటీ ప్లాట్​ ఫామ్​ ఏఎల్​టీ బాలాజీ, శోభా కపూర్​, జితేంద్ర కపూర్​లపైనా కేసు నమోదైంది.

ఏక్తా కపూర్‌ రూపొందించిన అన్‌ సెన్సార్డ్‌ సీజన్‌-2 వెబ్‌ సీరీస్ పై ఈ వివాదం చెల‌రేగింది. ‘ప్యార్‌ ఔర్‌ ప్లాస్టిక్‌’ ఎపిసోడ్‌లో ఒక వ్యక్తికి ఆర్మీ దుస్తులను తొడిగి ఇబ్బందిక‌రంగా మాట్లాడే సీన్లున్నాయి. ఇదే ఇష్యూకి సంబంధించి హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు కూడా ఓ ఫిర్యాదు అందింది.

44ఏళ్ల ఏక్తాకపూర్ బాలీవుడ్‌లో బ‌డా నిర్మాత‌ల్లో ఒకరు. ద‌ర్శ‌కురాలు కూడా. 1994లో ఏర్పాటు చేసిన బాలాజీ టెలిఫిలీంస్‌కు ఆమె క్రియేటివ్ హెడ్‌గా, జాయింట్ డైరెక్టర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఇటీవల సినిమా ఇండస్ట్రీకి ఏక్తా కపూర్ చేస్తున్న సేవలకు గాను ఆమెను సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.