AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaithi Movie: కార్తి నటించిన ‘ఖైదీ’ సినిమాను కాపీ చేశారు.. కోర్టుకెక్కిన రచయిత.. పట్టించుకోని నిర్మాతలు..

తమిళ స్టార్ హీరో కార్తి నటించిన 'ఖైదీ' మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కేవలం తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ మంచి విజయం అందుకున్న

Kaithi Movie: కార్తి నటించిన 'ఖైదీ' సినిమాను కాపీ చేశారు.. కోర్టుకెక్కిన రచయిత.. పట్టించుకోని నిర్మాతలు..
Kaithi
Rajitha Chanti
|

Updated on: Jul 07, 2021 | 7:26 AM

Share

తమిళ స్టార్ హీరో కార్తి నటించిన ‘ఖైదీ’ మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కేవలం తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ మంచి విజయం అందుకున్న ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించగా.. డ్రీమ్ వారియర్స్ సంస్థ నిర్మించింది. అటు ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా సూపర్ హిట్ అందుకోవడంతో.. సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అయితే ప్రస్తుతం ఈ సినిమాను కాపీ చేశారంటూ ఓ రచయిత కేరళ హైకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

రాజీవ్ అనే వ్యక్తి ఖైదీ సినిమా కథ తనది అంటూ వాదిస్తున్నాడు. ఒక కేసులో తాను అరెస్ట్ అయ్యి 2007లో విడుదలైన తర్వాత స్నేహితుడి ద్వారా డ్రీమ్ వారియర్స్ సంస్థ వారికి సంప్రదించానని.. అదే సమయంలో వారికి కథ చెప్పి అడ్వాన్స్ కూడా తీసుకున్నానని.. కానీ కథ విన్న తర్వాత మేకర్స్ చాలా రోజుల వరకు సైలెంట్‏గా ఉన్నారు. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ సంస్థ వారు అదే కథతో సినిమా నిర్మించారు అని వాదిస్తున్నాడు రాజీవ్. తన స్టోరీ లైన్‏తో డ్రీమ్ వారియర్స్ తన అనుమతి లేకుండా సినిమాను నిర్మించడం మాత్రమే కాకుండా.. తనకు క్రెడిట్స్ ఇవ్వలేదని.. అలాగే అందుకు తగిన పారితోషికం కూడా ఇవ్వలేదని కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో కేరళ హైకోర్టు.. డ్రీమ్ వారియర్స్ సంస్థకు, చిత్ర దర్శకుడికి నోటీసులు ఇచ్చిందని.. అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. మీడియా కథనాలపై డ్రీమ్ వారియర్ సంస్థ ప్రతినిధులు స్పందించారు. అయితే మీడియాలో కథనాలు వస్తున్నట్లుగా ఇప్పటివరకు తమకు కోర్టు నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు. కేసు గురించిన సమాచారం మాకు తెలియదు. అందుకే ఇప్పుడు ఈ విషయం పై  స్పందించాలనుకోవడం లేదు అంటూ నిర్మాతలు చెప్పారు. అటు ఈ విషయంపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ ను ప్రశ్నించిగా.. స్పందించడానికి నిరాకరిస్తున్నాడు. మొత్తానికి సూపర్ హిట్ ఖైదీ మూవీకి ఇలా కాపీ మరక అంటడం విచాకరం అంటున్నారు.

ఇదిలా ఉంటే.. రాజీవ్ తన కథకు నాలుగు కోట్ల పారితోషికంతోపాటు.. ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు కాపీ రైట్ తనకు మాత్రమే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. తనకు న్యాయం జరిగే వరకు సినిమా రీమేక్, సీక్వెల్స్ ను నిలిపివేయాలని కోర్టును కోరాడు రాజీవ్.

Also Read: Sonam Kapoor: బాలీవుడ్ వివాహ బంధాలపై సోనమ్ కపూర్ షాకింగ్ కామెంట్స్.. అందుకే ఇండస్ట్రీ వ్యక్తిని పెళ్లి చేసుకోలేదంటూ..