Venu Madhav: ఆ అలవాటే అతని ప్రాణం తీసింది.. ఎమోషనల్ అయిన వేణుమాధవ్ తల్లి
బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, అలీ లాంటి స్టార్ కమెడియన్స్ రాణిస్తున్న సమయంలో వాళ్లకు గట్టి పోటీ ఇచ్చారు వేణుమాధవ్. ఆ తర్వాత ఆయన అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరం అయ్యారు.
సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ముద్రవేసుకొని ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కమెడియన్స్ లో వేణుమాధవ్ ఒకరు. ఆయన కామెడీ టైమింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎన్నో సినిమాల్లో వేణుమాధవ్ తనదైన కామెడీతో ఆకట్టుకున్నారు. బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, అలీ లాంటి స్టార్ కమెడియన్స్ రాణిస్తున్న సమయంలో వాళ్లకు గట్టి పోటీ ఇచ్చారు వేణుమాధవ్. ఆ తర్వాత ఆయన అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరం అయ్యారు. ఆ తర్వాత 2019లో సెప్టెంబర్ 25న అనారోగ్యంతో కన్నుమూశారు. కార్ట్రవర్సీలకు దూరంగా ఉండే వేణుమాధవ్ చనిపోక ముందే ఆయన చనిపోయాడని చాలా రూమర్స్ వచ్చాయి. తాజాగా వేణుమాధవ్ తల్లి సావిత్రమ్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు.
కోట్ల ఆస్తి ఉన్నాకూడా వేణుమాధవ్ తల్లి అద్దింట్లో ఉంటున్నారట. ఆమె మాట్లాడుతూ..” నాకు ముగ్గురు కొడుకులు.. వేణుమాధవ్ చిన్న కొడుకు. చిన్ననాటి నుంచి చాలా చురుకుగా ఉండేవాడు. ఓ కార్యక్రమంలో మిమిక్రీ చేస్తుండగా దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి గారు చూసి వేణుకి తమ సినిమాలో ఆఫర్ ఇచ్చారు. అలాగా సినిమాల్లోకి వచ్చాడు.
దీంతో వేణుమాధవ్ కు మంచి గుర్తింపు లభించింది. వేణు నటుడిగా మంచి పొజిషన్లో ఉండడంతో నా ఇద్దరు కొడుకులని అతనికి అసిస్టెంట్లగా పెట్టాను అన్నారు. అయితే వేణుమాధవ్ ఎదిగాడు కానీ ఆ ఇద్దరు మాత్రం ఎదగలేదు. నేను చేసిన అతిపెద్ద తప్పు అదే. వేణు తన ఆరోగ్యాన్ని తానే పాడు చేసుకున్నాడు. ఎలాంటి వ్యాధి వచ్చినా కూడా మందులు వేసుకునేవాడు కాదు. అలానే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. అదే అతని ప్రాణాలు తీసింది. వేణు మాధవ్ కు సొంత ఇల్లు ఉంది. ఫ్లాట్ లు కూడా ఉన్నాయి. అందులో వేణుమాధవ్ కొడుకులు ఉంటున్నారు. నేను నా 3వ కొడుకుతో కలిసి అద్దింట్లో ఉంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు ఆమె.