Getup Srinu : జబర్దస్త్ మానేయడానికి అసలు కారణం ఇదే.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన గెటప్ శ్రీను..

"జబర్దస్త్" కామెడీ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు కమెడియన్ గెటప్ శ్రీను. స్టేజ్ పై ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి నటుడిగా అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం సినిమాల్లో సహయ నటుడిగా బిజీగా ఉంటున్నారు. ఇటీవలే రాకాస చిత్రంలో ముఖ్య పాత్ర పోషించి మరోసారి ఆకట్టుకున్నారు.

Getup Srinu : జబర్దస్త్ మానేయడానికి అసలు కారణం ఇదే.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన గెటప్ శ్రీను..
Getup Srinu

Updated on: Apr 14, 2026 | 11:19 AM

ప్రముఖ కమెడియన్ గెటప్ శ్రీను తన కెరీర్, “జబర్దస్త్” నుండి సినిమాలకు మారిన అనుభవాలు, మల్లెమాల సంస్థ పట్ల తన అపారమైన కృతజ్ఞతను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తొలుత సినిమాల్లోకి రావాలని ప్రయత్నించినా, చిన్న వయస్సు కారణంగా అవకాశాలు దక్కలేదని, ఆర్థిక ఇబ్బందులతో వెనక్కి వెళ్లాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. అనంతరం మల్లెమాల సంస్థ తన జీవితానికి “రెండవ జన్మస్థలం” అయ్యిందని, అది తనకు లైఫ్, ఇల్లు, కార్, ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చిందని శ్రీను కృతజ్ఞతగా గుర్తుచేసుకున్నారు. “ఇంత ఇస్తున్నప్పుడు మనం కూడా తిరిగి ఇవ్వాలి” అనే బాధ్యతతో అక్కడ కొనసాగానని తెలిపారు. అయితే, “రంగస్థలం” వంటి సినిమాలు చేస్తున్నప్పటికీ, టీవీ షెడ్యూల్స్ కారణంగా సినీ దర్శకులు తనకు డేట్లు ఇవ్వడానికి వెనకాడారని, “నాన్నకు ప్రేమతో” వంటి పలు మంచి సినిమా అవకాశాలు కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. దర్శకులు “టీవీలో బిజీగా ఉన్నావు కదా, డేట్లు సమస్య అవుతాయని” చెప్పేవారని ఆయన పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Prasad Behara : విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..

సుమారు తొమ్మిది, పదో సంవత్సరంలో సినీ కెరీర్‌కు మరింత సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు శ్రీను తెలిపారు. మల్లెమాల సంస్థలోని శ్యామ్ తన నిర్ణయాన్ని అర్థం చేసుకుని, “ఆల్ ది వెరీ బెస్ట్ శ్రీను. నీ కోసం మల్లెమాల గేట్లు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి” అని చెప్పడం తనలో గౌరవాన్ని మరింత పెంచిందని అన్నారు. మల్లెమాల సంస్థ తన జీవితానికి ఎంతగానో సహాయపడిందని, తన ఇల్లు తలుపుపై కూడా ఆ సంస్థ పేరు ఉంటుందని ఆయన చెప్పడం అతని లాయల్టీకి నిదర్శనం.

ఎక్కువ మంది చదివినవి : Prasad Behara : విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..

“జబర్దస్త్” ద్వారా వచ్చిన పాపులారిటీ అద్భుతమైనదని, ఏజెన్సీలు, ప్రాంతీయ ప్రాంతాల్లో కూడా ప్రజలు తనను గుర్తించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని శ్రీను అన్నారు. సినిమాల్లో నటించి ఉంటే ఇంత విస్తృతమైన జనాదరణ లభించేది కాదని, ప్రజలు ఇప్పటికీ తనను “జబర్దస్త్ శ్రీను” గానే గుర్తిస్తారని ఆయన స్పష్టం చేశారు. బ్రహ్మానందం వంటి ప్రముఖ హాస్యనటులు ఉన్న కాలంలో కమెడియన్లకు తక్కువ స్కోప్ ఉండేదని, అందుకే అప్పట్లో తనలాంటి వారికి అంత మైలేజ్ వచ్చి ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎక్కువ మంది చదివినవి : Monalisa Bhosle: మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఫర్మాన్ ఖాన్..

సినీ పరిశ్రమలో దర్శకులు తనలాంటి వారికి సరైన, బలమైన పాత్రలను రాయడానికి వెనుకాడుతున్నారని, “జబర్దస్త్”లో చేసినన్ని వేరియేషన్స్ చేసిన తర్వాత మంచి పాత్రే ఇవ్వాలి అనే కన్సర్న్ వారికి ఉందని శ్రీను వివరించారు. దర్శకుడు చలో వెంకీ వంటి స్నేహితులు కూడా తనకు మంచి పాత్ర ఇవ్వాలని కోరుకుంటారని, రెండు, మూడు సీన్ల పాత్రలు ఇవ్వలేమని చెబుతారని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Singer Mangli : అతడికి శ్రీముఖి పై క్రష్.. బిగ్ బాస్ కోసమే ఈ ప్లాన్.. మంగ్లీ సంచలన కామెంట్స్..

Follow Us