అతని చూసి ట్రైన్‌లో లేడీస్ అందరూ వెళ్లిపోయారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన అలీ

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా రాణిస్తున్నారు అలీ. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సీతాకోక చిలుక సినిమాతో బాలనటుడిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన అలీ. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు. కేవలం అలీ కోసమే సినిమాలకు వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు.

అతని చూసి ట్రైన్‌లో లేడీస్ అందరూ వెళ్లిపోయారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన అలీ
Ali

Updated on: Apr 07, 2026 | 4:09 PM

చైల్డ్ ఆర్టిస్ట్ గా  సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటుడు అలీ. ఆతర్వాత కమెడియన్‌గా, హీరోగా సుమారు 1200కి పైగా సినిమాల్లో నటించి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక  స్థానం సంపాదించుకున్నారు. కేవలం నటుడిగానే కాదు పలు టీవీ షోలకు హోస్ట్‌గా, యాంకర్‌గా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. కాగా ఓ ప్రముఖ ఛానెల్‌లో తాను హోస్ట్‌ చేస్తోన్న అలీతో సరదాగా అనే ప్రోగ్రామ్‌కు కొన్ని రోజులు గ్యాప్‌ ఇచ్చాడు అలీ. ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీ అవుతున్నారు అలీ. ఇదిలా ఉంటే తాజాగా అలీ ఓ సినిమా ఈవెంట్ లో చేసిన సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నటుడు అలీ, రేసు గుర్రం సినిమా రీ-రిలీజ్ ఈవెంట్‌లో హాస్యనటుడు రఘుబాబు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మురారి సినిమాలో రఘుబాబు చేసిన పాత్ర చూసి వివి వినాయక్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఆది సినిమాలో పోషించిన పాత్ర గురించి చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయని ఆయన అన్నారు. అలీ మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్, వి.వి వినాయక్ కాంబోలో వచ్చిన ‘ఆది’ సినిమా నాటి జ్ఞాపకాలను నటుడు అలీ పంచుకున్నారు. ఆ సినిమాలో గంగిరెడ్డి  పాత్ర పోషించిన రఘుబాబు నటన తనను ఎంతో ఆకట్టుకుందని చెప్పారు.

ఆ సినిమా చేసిన తర్వాత రఘుబాబు రైలు ప్రయాణం చేస్తుండగా.. ఆయనను చూసి ఆ కంపార్ట్‌మెంట్‌లోని మహిళలు భయపడి ఖాళీ చేశారని సరదాగా అన్నారు అలీ. రఘుబాబు నటన అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని చెప్పుకొచ్చారు. రఘుబాబు స్వభావరీత్యా చాలా మంచి వ్యక్తి అని, అయితే ఆది చిత్రంలో ఆయన పోషించిన పాత్ర ఎంతగానో భయపెట్టిందని అలీ అన్నారు. ఒక నటుడి పాత్ర ఎంత శక్తివంతంగా ఉంటుందో, దాని ప్రభావం తెర వెనుక కూడా ఎలా కొనసాగుతుందో అలీ మాటలు సరదాగా తెలియజేశాయి. ఈ వ్యాఖ్యలు రేసు గుర్రం రీ-రిలీజ్ ఈవెంట్‌కు ప్రత్యేకమైన నవ్వులను పంచాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us