AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Renu Desai: బూతులు తిట్టేంత పాపం మేమేం చేశాం.. మరో వీడియో రిలీజ్ చేసిన రేణూ దేశాయ్

టాలీవుడ్ నటి రేణూ దేశాయ్ ను అసభ్యకరంగా దూషించిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై పోలీసులకు ధన్యవాదాలు చెప్పిన రేణూ దేశాయ్ తాజాగా మరో వీడియోను రిలీజ్ చేసింది. ట్రోలర్స్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చింది.

Renu Desai: బూతులు తిట్టేంత పాపం మేమేం చేశాం.. మరో వీడియో రిలీజ్ చేసిన రేణూ దేశాయ్
Renu Desai
Basha Shek
|

Updated on: Apr 07, 2026 | 4:07 PM

Share

సినిమాలకు దూరంగా ఉంటోన్న రేణూ దేశాయ్ సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ సామాజిక సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. మహిళల సమస్యలు, మూగజీవాల సంరక్షణ తదితర అంశాలపై ఆసక్తికరమైన పోస్టులు, వీడియోలు షేర్ చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా రేణూ దేశాయ్ పై సామాజిక మాధ్యమాల్లో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా వీధి కుక్కల అంశంపై ప్రెస్ మీట్ పెట్టాక రేణూ దేశాయ్ పై ట్రోలింగ్ తాకిడి భారీగా పెరిగింది. దీనిపై ఆమె సైబరాబాద్ పోలీసులను కూడా ఆశ్రయించారు. ఆమె కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. దీనిపై పోలీసులకు ధన్యవాదాలు చెబుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు రేణూ దేశాయ్. తాజాగా ఆమె మరో వీడియోను రిలీజ్ చేసింది. తనతో పాటు సినిమా తారాలపై పని గట్టుకుని ట్రోలింగ్ చేస్తోన్న వారికి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారామె.

“కళాకారులంటే మీ దృష్టిలో నేరస్తులా లేక ఉగ్రవాదులా? అంత దారుణమైన పదజాలంతో దూషించడానికి వారేం తప్పు చేశారు? భావ ప్రకటనా స్వేచ్ఛకి, బూతులకు మధ్య ఉన్న తేడా మీకెందుకు అర్థం కావడం లేదు? మీకు వారి పని లేదా వారు చెప్పేది నచ్చకపోతే, ఇలా భయంకరమైన మాటలు మాట్లాడటానికి బదులుగా వారిని అన్‌ఫాలో చేసి ముందుకు సాగిపోండి. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే బూతులు తిట్టడం కాదు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. మీకు నచ్చని అభిప్రాయం చెబితే వెంటనే బూతులు తిట్టడం స్వేచ్ఛ అనిపించుకోదు. అది కేవలం వేధింపు మాత్రమే. ప్రతి మనిషికి గౌరవంగా బతికే హక్కు ఉంటుంది. దాన్ని కాలరాయకండి. తమ కష్టార్జితంతో గౌరవంగా బతికే కళాకారులను టార్గెట్ చేయడం మానుకోవాలి. లేదంటే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో హుందాగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. అనవసరపు విమర్శలతో ఇతరుల మనోభావాలను దెబ్బతీయవద్దు’ అని ట్రోలర్స్ ను హెచ్చరించింది రేణూ దేశాయ్.

ఇవి కూడా చదవండి

రేణూ దేశాయ్ వీడియో..

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

రేణూ దేశాయ్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. చాలా మంది నెటిజన్లు ఆమెకు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us