AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

F3 Movie: పక్కా పైసా వసూల్‌ మూవీ ఎఫ్3.. ప్రేక్షకులు పడి పడి నవ్వతారు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అలీ

విక్టరీ వెంకటేష్(Venkatesh), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'(F3 ).

F3 Movie: పక్కా పైసా వసూల్‌ మూవీ ఎఫ్3.. ప్రేక్షకులు పడి పడి నవ్వతారు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అలీ
Ali
Rajeev Rayala
|

Updated on: May 19, 2022 | 8:30 AM

Share

విక్టరీ వెంకటేష్(Venkatesh), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3′(F3 ). దిల్ రాజు సమర్పణ లో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన అలీ సినిమా విశేషాలను పంచుకున్నారు.. అలీ మాట్లాడుతూ.. ఎఫ్‌ 3 పక్కా ఫైసా వసూల్‌ మూవీ. వంద రూపాయలు పెట్టి సినిమా చూస్తే.. మూడు వందల రూపాయల ఆనందం వస్తుంది’ అని అన్నారు. ఈ మధ్య కాలంలో అలీ సినిమాలు తగ్గించారు దానికి కారణం ఏంటి అని ప్రశ్నిస్తే ఆయన స్పందిస్తూ..

బుల్లితెరపై ఒకే ఒక షో చేస్తున్నాను. అలాగే యమలీలా సీరియల్‌ చేశా. ఎస్వీ కృష్ణారెడ్డి గారి కోసమే ఆ సీరియల్‌ చేశా. ఎందుకంటే ఆయన నన్ను హీరో చేశాడు. స్టార్‌ దర్శకుడిగా ఉన్న ఆయన.. అందరిని ఒప్పించి నాతో సినిమా చేశాడు. అందుకే ఆయన ఏం చెప్పినా.. వెనక ముందు ఆలోచించకుండా చేసేస్తా. ఇక ఈ మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాల్లో మాకు క్యారెక్టర్‌ ఇస్తున్నారు. సినిమా కథ ఏంటో మాకు చెప్పరు. తీరా సినిమా చూస్తుంటే..అలీగారు ఎందుకు ఈసినిమాలో నటించాడు.? అని అందరు అనుకుంటారు. అభిమానులతో ఆ మాట అనిపించుకోవద్దనే కొన్ని సినిమాలు చేయడంలేదు. కథ విని నా క్యారెక్టర్‌ బాగుంటేనే సినిమా చేస్తా. కొత్త వాళ్లకు అయితే ఏదైనా పర్లేదు అని చేస్తారు. నాకు ఇప్పుడు ఆ అవసరం లేదు అన్నారు అలీ. అలాగే ఎఫ్ 3 గురించి మాట్లాడుతూ.. నా క్యారెక్టర్‌లో చాలా సత్తా ఉంది. లొకేషన్‌లో కూడా టెక్నీషయన్స్‌ బాగా ఎంజాయ్‌ చేశారు. శిరీష్‌ గారు అయితే 35 సార్లు చూసి కిందపడి మరీ నవ్వారని అనిల్‌ చెప్పారు. నా పాత్రను ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు. వడ్డీకి తిప్పే క్యారెక్టర్‌ నాది. ఆడవాళ్లు అంటే అపారమైన గౌరవం.. సినిమా ఎండింగ్‌లో మీకు ఆ విషయం తెలుస్తుంది. సినిమా మొత్తంలో 45 నిమిషాలకు పైగా నా పాత్ర ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన సినిమా. పైసా వసూల్‌ మూవీ. వంద రూపాయలు పెట్టి సినిమా చూస్తే.. మూడు వందల రూపాయల ఆనందం వస్తుంది.

ప్రస్తుతం అలీ నటిస్తున్న సినిమాలగురించి మాట్లాడుతూ.. అంటేసుందరానికి, ఎఫ్‌3, లైగర్‌, ఖుషీ, ఒకే ఒక జీవితం సినిమాలతో పాటు తమిళ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నా. కన్నడలో ధృవ సర్జా మూవీలో నటిస్తున్నాను. ఓ నేపాలి సినిమాలో కూడా యాక్ట్‌ చేస్తున్నా. ఒకప్పుడు మనం సినిమాల్లో అవకాశం కోసం వెళ్లేవాళ్లం. ఇప్పుడు వాళ్లే మన దగ్గరకు వస్తున్నారు. ఒకప్పుడు నార్త్‌వాళ్లను మనం తెచ్చుకునేవాళ్లం. మనం యాక్టింగ్‌ నేర్పించి, డబ్బింగ్‌ చెప్పించి డబ్బులు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు సౌత్‌ వాళ్ల సత్తా ఏంటో తెలిసింది. అక్కడి సినిమాల కోసం మమల్ని పిలుస్తున్నారు అని అన్నారు అలీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఇక్కడ చదవండి : 

F3 Movie: ఊపేసిన అనిల్‌ రావిపూడి.. పార్టీ సాంగ్‌తో తనదైన స్టెప్పులతో..

Major Movie: మేజర్‌ సినిమా నుంచి మరో అప్డేట్‌.. అలరిస్తోన్న ‘ఓ ఇషా’ రొమాంటిక్‌ సాంగ్‌..

Deepika Pilli: ట్రెండీ వేర్ లో కుర్రకారుని ఎట్రాక్ట్ చేస్తున్న దీపికా పిల్లి లేటెస్ట్ పిక్స్

Follow Us