కలర్ ఫోటో.. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు.. ఇటీవల జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు సైతం సొంతం చేసుకుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు. ఇందులో సుహాస్ సరసన చాందినీ చౌదరి కథానాయికగా నటించింది. అయితే ముందుగా ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయాలని అనుకున్నా.. కరోనా సంక్షోభం కారణంగా తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో విడుదల చేశారు. ఈ మూవీ సినీ ప్రియులను ఆకట్టుకోవడమే కాకుండా.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రతి సన్నివేశం ..ముఖ్యంగా చాందినీ నటనకు ప్రతి ప్రేక్షకుడి కళ్లు చెమ్మగిల్లాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యింది.
ఈ సినిమా నిర్మాత సాయి రాజేశ్.. డైరెక్టర్ సందీప్ రాజ్ కలర్ ఫోటో థ్రియాట్రికల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. వచ్చే నెల అంటే నవంబర్ 19న ఈ సినిమాను థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీంతో మూవీ లవర్స్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమాను అమృత ప్రొడక్షన్స్, లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కించాయి. ఇందులో హర్ష, శ్రీదివ్య, సునీల్ కీలకపాత్రలలో నటించగా.. కాలభైరవ సంగీతం అందించారు.
పేద, ధనిక.. కులాంతర, మతాంతర అంశాలను కాకుండా.. వర్ణ వివక్షను ఇతివృత్తంగా చేసుకుని ఈ ప్రేమకథను తెరకెక్కించారు డైరెక్టర్ సందీప్ రాజ్. అప్పటివరకు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ చేసిన సందీప్ దర్శకుడిగా తీసిన మొదటి సినిమా ఇదే. అలాగే సుహాస్ హీరోగా నటించి ఫస్ట్ మూవీ ఇదే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా నేషనల్ అవార్డ్ అందుకుని అందరి దృష్టి ఆకర్షించింది. ఇక ఇప్పుడు నేరుగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Yes….2 years for colourful blockbuster..
And
We are releasing in theatres on NOVEMBER 19th 2022…#ColourPhotoOnNov19th #ColourPhoto pic.twitter.com/6c2P8qjcu1— Sai Rajesh (@sairazesh) October 23, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.