CM.Revanth Reddy: ఇక పై నో బెనిఫిట్ షోస్.. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ ఫైర్

| Edited By: Rajeev Rayala

Dec 21, 2024 | 7:22 PM

పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట లో ఓ మహిళ మృతి చెందగా.. ఓ బాలుడు ఆసుపత్రిపాలయ్యాడు. ఈఘటన పై సీఎం రేవంత్ రెడ్డి సీరియర్ అయ్యారు. ఇప్పటికే పోలీసులు థియేటర్ యాజమాన్యం పై కేసు నమోదు చేశారు. అలాగే అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.

CM.Revanth Reddy: ఇక పై నో బెనిఫిట్ షోస్.. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ ఫైర్
Cm Revanth Reddy
Follow us on

పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో చనిపోయిన రేవతి ఘటన పై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా స్పందించారు.  ఘటనపై ముఖ్యమంత్రిని వివరణ కోరగా అసలు సంధ్య థియేటర్ ఘటనలో ఏం జరిగిందో పూసకొచ్చినట్టుగా వివరించారు. దాంతో పాటుగానే సినిమా ఇండస్ట్రీ పెద్దలపై కూడా సీఎం కామెంట్ చేశాడు. సినిమా రంగ అభివృద్ధికి ప్రోత్సాహం చేస్తాం అంటూనే ..ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఎట్టి పరిస్థితుల్లో సీఎం కుర్చీలో కూర్చున్నంతవరకు ఒప్పుకునేది లేదంటూ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్. ఆ వెంటనే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో టికెట్ల రేట్ల పెంపులను బెనిఫిట్ షో లను బ్యాన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ప్రభుత్వ ఈ నిర్ణయం పై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మద్దతు తెలపడం విశేషం.

సంధ్య థియేటర్ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సెలెబ్రిటీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదు…అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్ కు వెళ్లారు…అతను కేవలం థియేటర్ కు వెళ్లి సినిమా చూసి వెళ్ళిపోతే అభ్యంతరం ఉండేది కాదు…కానీ థియేటర్ కు వెళ్ళేటప్పుడు రోడ్డుపై కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటూ వెళ్లారు.. దీంతో పక్కన ఉన్న అన్ని థియేటర్ల నుంచి ఒక్కసారిగా పబ్లిక్ సంధ్య థియేటర్ వైపు రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో తల్లి రేవతి చనిపోయింది. ఆమె కొడుకు కోమాలోకి వెళ్ళాడు.

అంత తొక్కిసలాటలో కూడా ఆ తల్లి కొడుకు చేయి విడిచిపెట్టలేదు.. బిడ్డపై తల్లి ప్రేమ అలాంటిది. కొడుకు చేయి పట్టుకుని ఆ తల్లి చనిపోయింది.. హీరో థియేటర్ లోపల ఉండటం వల్ల లోపల కూడా తొక్కిసలాట జరిగింది. ఈ విషయాన్ని హీరోకు ఏసీపీ చెప్పినా.. శాంతి భద్రతలు చేయి దాటే ప్రమాదం ఉందని చెప్పినా హీరో వినలేదు. బయటకు వెళ్లడానికి హీరో ఒప్పుకోలేదని సిటీ కమిషనర్ చెప్పారు. దీంతో డీసీపీ వెళ్లి అక్కడ నుంచి కదలకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించి హీరోను కారు ఎక్కించారు.. అయినా వెళ్ళేటప్పుడు కూడా కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేస్తూ వెళ్లారు.

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో హీరోపై , యాజమాన్యం పై పోలీసులు కేసు పెట్టారు.. బాధ్యత రహితంగా సమాధానాలు ఇవ్వడం వల్లే పోలీసులు వారి విధి నిర్వహించారు.. ఈ ఘటనపై కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికత్వం ప్రదర్శించాయి. తన కొడుకు ఆ హీరో అభిమాని అని కొడుకు కోసం ఒక్కో టికెట్ రూ.3వేల చొప్పున రూ.12వేలు పెట్టి ఆ కుటుంబం సినిమా టికెట్లు కొన్నారు. థియేటర్ లో ఒక తల్లి చనిపోతే ఆ కుటుంబాన్ని, ఆ పిల్లవాన్ని హీరో పరామర్శించలేదు. అలాంటి మానవత్వం లేని వాళ్ళను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే పదేళ్లు మంత్రులుగా పని చేసిన వాళ్లు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. చావుకు కారణమైన వారిని పోలీస్ స్టేషన్ కు పిలిస్తే.. తప్పు పట్టి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఎంతో నీచమైన భాష వాడారు.. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని భావించి మా ప్రభుత్వం ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది. ప్రాణాలు బలి తీసుకుంటే వాళ్లను ఏమీ అనొద్దు అంటే ఇదేం న్యాయం.. సినీ,సిరాజకీయ ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఏమైనా చేస్తారా..? అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి లోబడే మా ప్రభుత్వం నడుచుకుంటోంది. జైలుకు వెళ్లి వచ్చిన హీరో ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖుల్లో.. బాధిత కుటుంబాన్ని ఒక్కరైనా కలిసారా..? సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం కోరుకుంటున్నరో తెలియడం లేదు.. వ్యాపారాలు చేసుకోండి… కానీ ప్రాణాలతో చలాగాటమాడటానికి మేం ఒప్పుకోము. మేం అధికారంలో ఉన్నంత కాలం అలాంటి ఆటలు సాగవు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.