Titanic Re-Release: అద్భుతమైన ప్రేమకావ్యం టైటానిక్‌ రి రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజే

వెండితెరపై ఆవిష్కరించిన అద్భుతమైన ప్రేమకావ్యం టైటానిక్‌. ప్రపంచ సినీ చరిత్రలోనే గొప్ప సినిమాల్లో ఇదీ ఒకటి. చారిత్రక, రొమాంటిక్‌ అంశాల మేలుకలయిక అయిన ఈ చిత్రం విడుదలై 2022 డిసెంబరుకు 25 ఏళ్లు పూర్తయ్యింది.. ఈ సందర్భంగా దర్శకుడు జేమ్స్​ కామెరూన్​.. టైటానిక్ ప్రియులకు ఓ సర్​ప్రైజ్​ ఇచ్చాడు.

Titanic Re-Release: అద్భుతమైన ప్రేమకావ్యం టైటానిక్‌ రి రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజే
Titanic Re Release
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 13, 2023 | 4:34 PM

టైటానిక్‌..ఈ పేరు వింటే మనకు గుర్తొచ్చేది విషాద ఘటనే.  మరోవైపు ప్రపంచమంతా మెచ్చుకున్న అద్భుతమైన వెండితెర ప్రేమకావ్యం. ఆ విషాద దుర్ఘటనకు ఓ అందమైన ప్రేమకథను జోడించి అందరి హృదయాలను హత్తుకునేలా చేశాడు దర్శకుడు జేమ్స్​ కామెరూన్. 1997 డిసెంబరులో విడుదలైన ఈ మూవీ ప్రాంతీయ, భాషా భేదాలు లేకుండా అందరీ మనసుల్లో చెరగని ముద్ర వేసిందీ చిత్రం. ప్రపంచ చరిత్రలోనే అత్యంత విషాదమైన టైటానిక్ ప్రమాదానికి, ఇద్దరు ప్రేమికుల గాఢమైన ప్రేమను ముడిపెట్టి, మునుపెన్నడూ చూడని స్పెషల్ ఎఫెక్ట్స్​తో సినిమాను ఉద్విగ్నభరితంగా చూపించారు జేమ్స్. ఈ చిత్రం సాంకేతికంగా ఎంత అద్భుతంగా ఉంటుందో, సినిమాలోని సన్నివేశాలు, పాత్రలు వారి నటన కూడా ప్రేక్షకుల్ని టైటానిక్​ ప్రపంచంలో అంతే లీనమయ్యేలా చేసింది.

అయితే టైటానిక్‌ విడుదలై 2022 డిసెంబరుతో 25 వసంతాలు పూర్తి చేసుకుంది.. ఈ సందర్భంగా టైటానిక్​ ప్రియులకు ఓ సర్​ప్రైజ్​ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు దర్శకుడు జేమ్స్​కామెరూన్​. సినిమాను రీమాస్టర్డ్​ వెర్షన్లో రిలీజ్​ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రీమాస్టర్డ్​ అంటే..3డీ, 4కే హెచ్​డీఆర్​, హై ఫ్రేమ్​ రేట్​ ఫార్మాట్​లో మరింత క్వాలిటీగా దీన్ని విడుదల చేయడం. ఫిబ్రవరిలో వచ్చే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నాలుగు రోజుల ముందుగానే అంటే.. ఫిబ్రవరి 10న టైటానిక్‌ను ఆడియన్స్‌ ముందుకు తీసుకొస్తున్నారు..ఇప్పటికే ఈ చిత్రాన్ని 2012లో 3డీ ఫార్మాట్​లో రిలీజ్​ చేశారు.

లియోనార్డో డికాప్రియో, కేన్‌ విన్‌స్లెట్‌ జోడీ పండించిన ప్రేమ అద్భుతం

వైన్‌ బాటిల్‌ ఎంత పాతదైతే అంత టేస్ట్‌ వచ్చినట్లు కొన్ని సినిమాలు ఎంత పాతవైనా కొత్త ఫీల్‌ను ఇస్తుంటాయి. అలాంటి సినిమాల్లో టైటానిక్‌ది టాప్ ప్లేస్.. ఇప్పటికే ఎన్నో సార్లు ఈ సినిమాను టీవీల్లో, ఫోన్‌లలో చూసుంటాం. అయినా గానీ ఇప్పటికీ టెలికాస్ట్‌ అవుతుందంటే టీవీలకు అతుక్కుపోతుంటాం. అలాంటి ఎవర్‌గ్రీన్‌ క్లాసికల్‌ మూవీ టైటానిక్‌. విషాదభరిత ప్రేమకథను ఇంత గొప్పగా, పోయేటిక్‌గా జేమ్స్‌ కామెరూన్‌ తప్ప ఎవరూ తీయలేరని బల్ల గుద్ది చెప్పొచ్చు. ఈ సినిమాలో ఎన్నో ఐకానిక్‌ సన్నివేశాలు ఉన్నాయి. షిప్పు మునిగిపోయే సన్నివేశం, షిప్పులో ఉన్న జనాలు ప్రాణాలు కోల్పోయే క్రమంలో ఏర్పడే భావోద్వేగాలు ఇలా ఎన్నో అద్భుతమైన సన్నివేశాలను జేమ్స్ కామెరూన్‌ తెరకెక్కించాడు. ఇక లియోనార్డో డికాప్రియో, కేన్‌ విన్‌స్లెట్‌ జోడీ పండించిన ప్రేమకు మంత్ర ముగ్ధుడవని ప్రేక్షకుడు ఉండగలడా..

అప్పట్లోనే రూ.13 వేల కోట్లకు పైగా కలెక్షన్లు

టైటానిక్‌లో జాక్‌, రోజ్‌ ప్రేమకథ బాగా రక్తి కట్టిందనుకున్న టైమ్‌లోనే..విచిత్రమైన విధి ఆట మొదలవుతుంది..టైటానిక్‌ ఓడ ప్రయాణ మధ్యలో బలమైన మంచు కొండను ఢీ కొట్టుకుని మునిగిపోతుంది. ఈ క్రమంలోనే వీలైనంతమందిని టైటానిక్‌ సిబ్బంది కాపాడుతారు.. కానీ..ఈ ప్రమాదంలో జాక్​ మునిగిపోగా.. రోజ్​ బ్రతికి ఒంటరిగా మిగిలిపోతుంది. ఈ విషాదాంత ప్రేమకథ ప్రపంచం మొత్తాన్ని ఆకట్టుకుంది..కోటాను కోట్ల మంది హృదయాలను తాకింది..25 ఏళ్ల కిందట విడుదలైన టైటానిక్‌ అప్పట్లో భారీ వసూళ్లను సాధించింది.. దాదాపు 13వేల కోట్లకు పైగా కలెక్షన్లను అందుకుంది. 11 ఆస్కార్‌ అవార్డులను గెలుచుకుంది. 1912లో సౌతంప్టన్‌ నుంచి న్యూయార్క్‌ వెళ్తుండగా.. నార్త్‌ అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఐస్‌బర్గ్‌ను ఢీకొని మునిగిపోవడం, దాదాపు 1500 మంది జలసమాధి అయ్యారు. ఇది జరిగిన కథ.. దీనికి అద్భుతమైన ప్రేమకథను జోడించి సినిమాగా రూపొందించారు.

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 10న రీ రిలీజ్‌

టైటానిక్‌ ఓ కళాఖండం..తాజాగా సిల్వర్‌ జూబ్లీ పూర్తి చేసుకున్న సందర్భంగా రీ-రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 25 ఏళ్ల కిందట చూసినప్పుడే..ఆడియన్స్‌ వావ్‌ అన్నారు. ఇప్పటికీ ఆ పేరు చెబితేనే గుండెల్లో ఏదో తెలియని వైబ్రేషన్స్.. అలాంటి సినిమా.. హైక్వాలిటీ..4K తో వస్తే ఇంకెలా ఉంటుంది. లవర్స్‌ ఫిదా అయిపోరూ.. జేమ్స్‌ కామరూన్‌ ఆ పని చేయడానికే మళ్లీ వస్తున్నాడు.. లవర్స్​డే స్పెషల్​గా వచ్చే నెల 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించిన చిత్రబృందం పోస్టర్‌తో పాటు ఓ ట్రైలర్‌ని విడుదల చేసి ఫ్యాన్స్‌కు లవ్‌ ట్రీట్‌ ఇచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.