Corona Shekar Master: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఓవైపు కొందరి ఆరోగ్యాలు ప్రమాదంలో పడుతుంటే మరికొందరి జీవితాలు ఉపాధి లేక ఆగమైపోతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా పనిలేక ఎంతో మంది తినడానికి తిండి కూడా లేక అవస్థలు పడుతున్నారు. రోజు పనిచేస్తే తప్ప ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లని పరిస్థితి మన సమాజంలో ఎంతో మంది ఉంది. అయితే ఈ క్రమంలోనే పేద ప్రజల మేలు కోసం కొంత మంది ముందుకొస్తున్నారు. తమ వంతు సాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ డ్యాన్సర్లకు అండగా నిలిచారు. లాక్‌డౌన్ కారణంగా షోలు లేక ఉపాధి కోల్పోయిన డ్యాన్సర్లకు తనవంతు సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రూపు డ్యాన్సర్లు, టీవీ షోలు చేసే డ్యాన్సర్లకు ఈ సమయంలో పని దొరకడం చాలా కష్టంగా మారిందని చెప్పుకొచ్చారు. ఏదైనా టీవీ షోలు, కార్యక్రమాలు జరిగితే తప్ప వాళ్లకు పని ఉండదన్న శేఖర్ మాస్టర్.. భోజనానికి కూడా డబ్బులు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కరోనా సమయంలో ఇలా ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వెంటనే తనకు ఫోన్ చేసి చెప్పమని శేఖర్ మాస్టర్ ప్రకటించారు. అలాంటి వారికి తన టీమ్ సభ్యులు అవసరమైన సరుకులు అందిస్తారని చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవని అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని చెప్పుకొచ్చారు.
Telugu Directors: లాక్ డౌన్ సమయంలో మన డైరెక్టర్లు ఏం చేస్తున్నారో తెలుసా..?