Kannappa Movie: మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమా షూటింగ్‌లో మరో అపశ్రుతి.. స్టార్‌ కొరియోగ్రాఫర్‌కు గాయం

ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కన్నప్ప షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా ప్రారంభించినప్పటి నుంచి తరచూ అవాంతరాలు వస్తున్నాయి. మొదట హీరోయిన్‌ నుపుర్‌ సనన్ కన్నప్ప సినిమా నుంచి తప్పుకుని షాక్‌ ఇచ్చింది. ఆ తర్వాత షూటింగ్‌లో మంచు విష్ణు గాయపడ్డాడు. కెమెరా డ్రోన్ తగలడంతో మంచు వారబ్బాయి మోచేతికి తీవ్ర గాయమైంది. దీంతో షూట్‌ను కూడా తాత్కాలికంగా నిలిపేశారు.

Kannappa Movie: మంచు విష్ణు కన్నప్ప సినిమా షూటింగ్‌లో మరో అపశ్రుతి.. స్టార్‌ కొరియోగ్రాఫర్‌కు గాయం
Choreographer Brinda Master

Updated on: Dec 11, 2023 | 7:07 PM

జిన్నా మూవీ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న మంచు విష్ణు తన డ్రీమ్‌ప్రాజెక్టు కన్నప్ప షూటింగ్‌లో బిజీగా ఉంటున్నాడు. ముక్కంటి కొలువైన శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మరీ కన్నప్ప మూవీని పట్టాలెక్కించారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కన్నప్ప షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా ప్రారంభించినప్పటి నుంచి తరచూ అవాంతరాలు వస్తున్నాయి. మొదట హీరోయిన్‌ నుపుర్‌ సనన్ కన్నప్ప సినిమా నుంచి తప్పుకుని షాక్‌ ఇచ్చింది. ఆ తర్వాత షూటింగ్‌లో మంచు విష్ణు గాయపడ్డాడు. కెమెరా డ్రోన్ తగలడంతో మంచు వారబ్బాయి మోచేతికి తీవ్ర గాయమైంది. దీంతో షూట్‌ను కూడా తాత్కాలికంగా నిలిపేశారు. ఇటీవలే మళ్లీ షూటింగ్‌ను పునఃప్రారంభించారు. ఇక అంతా బాగుందనుకునే తరుణంలో కన్నప్ప షూటింగ్‌లో మరో అపశ్రుతి చోటు చేసుకుంది. ఓ సాంగ్‌ షూట్‌ చేస్తుండగా స్టార్ కొరియోగ్రాఫర్ బృంద మాస్టర్ కాలికి ఫ్రాక్చర్ అయ్యిందట. దీంతో షూటింగ్ మధ్యలోనే నిలిపేశారట. కొన్నిరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని బృందాకు సూచించారట వైద్యులు. అయితే బృందా మాస్టర్‌ గాయంపై కన్నప్ప చిత్ర బృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

పరమ శివుడి మహా భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాలో టైటిల్ రోల్ మంచు విష్ణు పోషిస్తున్నారు. శివపార్వతులుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నయనతార నటించనున్నారు. అలాగే మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, శాండల్ వుడ్ నుంచి శివ రాజ్ కుమార్, కోలీవుడ్ నుంచి శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం తదితర దిగ్గజ నటీనటులు కన్నప్ప మూవీలో భాగమవుతున్నారు. హిందీలో మహాభారత్ వంటి సీరియల్‌ను రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూ.150 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు మోహన్‌ బాబు.

ఇవి కూడా చదవండి

సాంగ్ షూట్ లో గాయపడిన బృందా మాస్టర్..

 

కన్నప్ప సినిమాలో విష్ణు ఫస్ట్ లుక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.