Chiyaan Vikram : కరోనా మహమ్మారి ఎవ్వరిని వదలడం లేదు. ఇప్పుడు సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందురు కరోనా భారిన పడుతున్నారు. ఇటీవలే లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ , యాక్షన్ కింగ్ అర్జున్ కరోనా భారిన పడ్డారు తాజాగా మరో స్టార్ హీరో ఈ మహమ్మారి భారిన పడ్డాడు. తమిళ్ స్టార్ హీరో విక్రమ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. గత రెండు రోజులుగా హై ఫీవర్ తో భాదపడుతున్న విక్రమ్ కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయన అభిమానులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు.
అయితే.. విక్రమ్ కు కరోనా నేనా లేక ఒమిక్రాన్ వేరియంటా .? అని నిర్ధారించడానికి పరీక్ష రిపోర్టులను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపినట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటం తో పరాజయాలు భాబ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వం .. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరో వైపు ఒమిక్రాన్ మన దేశం లోకి ప్రవేశించడంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :